బిగ్ బాస్ కి అనుకోని ఆహ్వానం బిగ్ బాస్‌ పదమూడోవారం ఎమోషనల్‌ జర్నీగా మారుతోంది. ప్రస్తుతం ఇంట్లో ఏడుగురు హౌస్‌మేట్స్‌ మిగిలారు. వీరు టీవీ, ఫోన్‌లను వదిలేసి, బయట ప్రపంచానికి దూరంగా ఉంటూ 85 రోజులు కావస్తోంది. ఉన్నదల్లా హౌస్‌లో ఉన్నవారితోనే ఆటలు, పాటలు, అల్లరి పనులు, గొడవలు, వగైరా  ఏ ఎమోషన్‌ అయినా బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నవారితోనే పంచుకోవాలి, వారితోనే తెంచుకోవాలి. 


ఇక బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన ఇంటి సభ్యులకు బిగ్‌బాస్‌  ఊరట  కలిగించారు. వారి కుటుంబ సభ్యులను ఇంట్లోకి పంపించారు. దీంతో కొద్ది నిమిషాలైనా ఫ్యామిలీ మెంబర్స్‌తో గడిపే అవకాశం దక్కిందని హౌజ్‌మేట్స్‌అందరి లో  ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. అదే సమయంలో వారు వచ్చి వెళ్లిపోతుంటే కన్నీటిపర్యంతం అవుతున్నారు. బిగ్‌బాస్‌ పదమూడోవారం ఎమోషనల్‌ జర్నీగా మారుతోందివారి కుటుంబ సభ్యులను ఇంట్లోకి పంపించారు.


 ఫ్యామిలీ మెంబర్స్‌తో గడిపే అవకాశం దక్కిందని హౌజ్‌మేట్స్‌ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. అదే సమయంలో వారు వచ్చి వెళ్లిపోతుంటే కన్నీటిపర్యంతం అవుతున్నారు.  గత రెండు రోజులుగా. వితికా చెల్లెలు రితికా, అలీ భార్య మసుమ, బాబా భాస్కర్ కొడుకు, కూతురు, కొడుకు ఇప్పటికే బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లగా.. గురువారం నాడు బిగ్ బాస్ ఇంటికి రాహుల్ తల్లి, వరుణ్ బామ్మ వచ్చారు.


రేయ్ రాహుల్.. ఎక్కడ ఉన్నావ్ రా’ అంటూ రాహుల్ తల్లి సీక్రెట్ రూంనుండి పిలుస్తుండగా.. రాహుల్ తన తల్లి ఒడిలో ఒదిగిపోయాడు. ఇక బిగ్ బాస్ హౌస్‌కి వరుణ్ సందేశ్ బామ్మ స్పెషల్ గెస్ట్‌గా వచ్చారు. ‘నా మనువడు ఎంతో మీరంతా అంతే నాకు’ అంటూ ఇంటి సభ్యులతో ముచ్చట్లుపెట్టింది బామ్మగారు. ఇక ఇంటి సభ్యులు అందరికీ దీపావళి శుభాకాంక్షల్ని చెప్తోంది బామ్మ. ఇక బామ్మను రాజ్యలక్షి అంటూ బిగ్ వాయిస్‌తో బిగ్ బాస్ పిలుస్తుండగా.. ‘బిగ్ బాస్ గారూ.. మా ఇంటికి రావాలి మీరు’ అంటూ ఇంటిలో ఉన్న కంటెస్టెంట్స్‌నే కాకుండా ఆడియన్స్‌ని కూడా తన మాటలతో అలరిస్తోంది బామ్మ. ఇక ఈ మరిన్ని ముచ్చట్లను నేటి ఎపిసోడ్‌లో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: