బండ్ల గణేష్... వివాదాస్పదంగా మాట్లాడే ఈయన ఆ మధ్య రాజకీయాల్లోకి  కూడా వచ్చారు. ఆత్మహత్యల చాలెంజ్ లు చేశారు. ఆ తర్వాత రాజకీయాల్లో అడ్రస్ లేదు.ఆ సంగతలా ఉంటే.. బండ్ల గణేష్ పై ఉన్న చెక్ బౌన్స్ ల ఫిర్యాదులు కూడా ఆసక్తిదాయకంగా ఉన్నాయి. ఈ నిర్మాతపై ఏకంగా ఎనభైకి పైగా చెక్ బౌన్స్ పిర్యాదులున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చనేది ఇండస్ట్రీలో నడుస్తున్నటాక్!                                                                                       


ఇప్పుడు లబోదిబోమంటున్న కడపజిల్లా ప్రొద్దుటూరు వాళ్ళు అందుకు అంటే వాళ్లకే భారీఎత్తున బౌన్స్ అయ్యే చెక్కులను ఇచ్చాడట బండ్ల.భారీఎత్తున వ్యాపారస్తులు ఉంటారు ప్రొద్దుటూరులో. అలాంటి వారి నుంచి ఇతడు అప్పులు తెచ్చాడట.అప్పులు తీసుకొని  బౌన్స్ ఐయే చెక్కులు ఇవ్వడం చేస్తున్న బండ్ల సినిమాలు తీయడానికి అంటూ అప్పులు తెచ్చి..ఇప్పుడు తప్పించుకు తిరుగుతున్నారని వారు లబోదిబోమంటూ వాపోతున్నారు.       

ఇండస్ట్రీలో ఒక మిస్టీరియస్ పర్సన్ బండ్ల . ఇతను ఎలా బడా ప్రొడ్యూసర్ అయ్యాడనేది దశాబ్దం కిందటి మిస్టరీ. అది అలా కొనసాగుతూ ఉంది. ఇక తన వెనుక చాలా ఉందనేది బండ్ల గణేష్ చెప్పుకునేమాట. ఇలా ఎనభైకి పైగా చెక్ బౌన్స్ కేసులు కలిగినవారు ఇండస్ట్రీలోనే ఎవరూ లేరని, అది కేవలం బండ్ల గణేష్ కే సాధ్యం అవుతున్న ఫీట్ అని ఇండస్ట్రీలో జనాలు అంటున్నారు! 
మరి ఇక ముందు ఎం చేస్తాడో చూడాలి. తీసిన సినిమాలు అని బాక్సాఫీస్ దగ్గర  బోల్తాకొడుతుంటే ... బండ్ల మాత్రం ఎం చేస్తాడు...అప్పు ఇచ్చిన వాళ్ళకి బౌన్స్ చెక్కులు ఇవ్వడం తప్ప అంటున్నారంట  అందరూ.  



మరింత సమాచారం తెలుసుకోండి: