మాస్ మహారాజ రవితేజ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థ్రిల్లర్ సినిమా 'డిస్కో రాజా'. మన మాస్ మహారాజ ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా ఏదో ఒక కారణంతో వాయిదా పడుతూనే ఉంది. ఇంతకముందు కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అయ్యింది. దాంతో సినిమా విడుదల తేదీ చాలా దూరం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో సినిమాను ఈఏడాది చివర్లో అంటే డిసెంబర్ నెలలో విడుదల చేస్తామంటూ చిత్ర బృందం ప్రకటించారు. కాని క్రిస్మస్ సందర్బంగా కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇలాంటి పోటీ సమయంలో డిస్కో రాజాను కాస్త ఆలస్యంగా విడుదల చేయడం మంచిదని మళ్ళీ చిత్ర బృందమే భావిస్తున్నారని తాజా సమాచారం.  
 
పోటీ లేనప్పుడే 'డిస్కో రాజా'ను విడుదల చేసే ఉద్దేశ్యంతో సినిమాకు కొత్త రిలీజ్ డేట్ ను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. సంక్రాంతికి 4-5 పెద్ద సినిమాలు ఉన్న కారణంగా ఆ తర్వాత రిపబ్లిక్ డే కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారట. ప్రతి సంవత్సరం కూడా రిపబ్లిక్ డేకు పెద్ద సినిమాలు వస్తూనే ఉన్నాయి. సంక్రాంతి సీజన్ ముగిసిన వెంటనే రిపబ్లిక్ డే కు వచ్చే సినిమాలు కూడా మంచి వసూళ్లు సాధించిన సందర్భాలు గతంలో చాలా ఉన్నాయి. అందుకే రిపబ్లిక్ డే సందర్భంగా డిస్కోరాజా ను విడుదల చేయాలని అనుకుంటున్నారట.  

దర్శకుడు విఐ ఆనంద్ గత సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు మంచి కలెక్షన్స్ ను కూడా రాబట్టాయి. అయితే రవితేజ పరిస్థితి మాత్రం విభిన్నంగా ఉంది. మాస్ రాజాకి మంచి కమర్షియల్ హిట్ పడి చాలా కాలం అయ్యింది. మద్యలో రాజా ది గ్రేట్ మినహాయిస్తే రవితేజ కెరీర్ చాలా డల్ గా ఉంది. ఈ నేపథ్యంలో రవితేజ కు 
ఈ సినిమా సక్సెస్ చాలా అవసరం. అందుకే చాలా జాగ్రత్తగా సినిమాను రూపొందించారు. అలాగే అనవసరంగా పోటీ ఎక్కువ ఉన్న సమయంలో కూడా విడుదల చేయవద్దని భావిస్తున్నారు. ఈ కారణాల వల్లే డిస్కోరాజా సినిమా వచ్చే ఏడాది జనవరి చివర్లో రిపబ్లిక్ డే సందర్బంగా విడుదల చేయాలని భావిస్తున్నారని సమాచారం. ఇక ఈ సినిమాలో రవితేజ కు జోడీగా నభా నటేష్, పాయల్ రాజ్ పూత్ లు నటిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: