నాచురల్  స్టార్ నాని -మనం ఫేమ్ విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన  లేటెస్ట్ మూవీ  గ్యాంగ్ లీడర్.  రివేంజ్ డ్రామా  నేపథ్యంలో తెరకెక్కిన ఈచిత్రం  ఇటీవల  విడుదలై మిక్సడ్ టాక్ ను  తెచ్చుకోవడంతో  బాక్సాఫీస్ వద్ద  అనుకున్న స్థాయిలో  వసూళ్లను రాబట్టలేకపోయింది.  సుమారుఈ చిత్రం 5 కోట్ల వరకు నష్టాలను తీసుకొచ్చిందని టాక్.  ఫస్ట్ హాఫ్ ను ఆసక్తికరంగా   నడిపించిన  దర్శకుడు సెకండ్ హాఫ్ లో తేలిపోయాడు. దాంతో ఫలితం తారుమారైంది. అయితే నాని కోసం ఈ సినిమా ఓసారి చూసేయొచ్చ.



ఇకఇటీవల 30రోజుల థియేట్రికల్ రన్ కూడా  కూడా పూర్తి చేసూకోకుండానే  అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ లోకి  తీసుకొచ్చింది . దాంతో నెటిజన్లనుండి విమర్శలు రావడంతో గంట వ్యవధిలో  ఈ సినిమాను తొలిగించింది ప్రైమ్. అయితే  గ్యాంగ్ లీడర్ ను అలా థియేటర్ల నుండి తొలిగించారో లేదో  మళ్ళీ ఈరోజు ఈచిత్రం ప్రైమ్ వీడియోలో  అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. 



ఇదిలా ఉంటే  నాని ప్రస్తుతం తన  25వ చిత్రం 'వి' లో నటిస్తున్నాడు. మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  సుధీర్ బాబు మరో హీరోగా నటిస్తుండగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి  డైరెక్ట్ చేస్తున్నాడు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్  గా రూపొందుతున్న ఈచిత్రంలో  నివేధ థామస్ , అధితి రావ్ హైదరి కథానాయికలు నటిస్తున్నారు.  ఇక ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఉగాది కి విడుదలచేయనున్నారని  తెలుస్తుంది.  మరి ఈ చిత్రం నానికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందోచూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: