మెగాస్టార్ చిరంజీవి తన 152వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే.  కొరటాల అంటే కమర్షియల్ ఎంటెర్టైనర్లకు పెట్టింది పేరు.  చిరు ఒక పూర్తిస్థాయి కమర్షియల్ సినిమా చేస్తే చూడాలని ఎన్నాళ్ళగానో ఆశిస్తున్న అభిమానులు ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్నారు.  అంతేకాదు సినిమాలో ఏయే  అంశాలు ఉండబోతున్నాయో అంచనాలు వేసుకుంటున్నారు.  ఒక్కసారి చిరు, కొరటాల బలబలాలను బట్టి మనం కూడా వీరి సినిమాలో ఉండబోయే అంశాలు, ఉండని అంశాలు ఏమిటో చూద్దాం.  ముందుగా అభిమానులు కోరుకునే హీరో ఎలివేషన్స్ విషయానికొస్తే చిరు, కొరటాల ఇద్దరూ వాటికి ఏమాత్రం వెనుకాడరు.  కాబట్టి చిత్రంలో బోలెడంత హీరోయిజమ్ దొరుకుతుంది.  అలాగే చిరు ప్రధాన బలమైన డ్యాన్సులు విషయానికొస్తే తన సినిమాలో మంచి సాంగ్స్, డ్యాన్సులు ఉండేలా చూస్తారు.   కాబట్టి చిరు నుండి 'ఖైదీ నెం 150' లెవల్లో స్టెప్స్ ఆశించవచ్చు.  

ఇక చిరు కామెడీ చేస్తే చూడాలని అభిమానులు ఎప్పుడూ ఆశిస్తూనే ఉంటారు.  కానీ కొరటాల చిత్రాల్లో కామెడీ పెద్దగా ఉండదు.  ఆయన సినిమాల్లోని హీరోలంతా ఎప్పుడూ సీరియస్ మోడ్ ఆన్ చేసినట్టే ఉంటారు.  పైగా లాంటి ట్రాక్స్ కొరటాల ఎప్పుడూ రాసింది లేదు.  కాబట్టి సినిమాలో కామెడీకి స్కోప్ ఉండకపోవచ్చు.  ఇక అన్నిటికంటే ప్రధానమైన సోషల్ ఇష్యూ తప్పకుండా ఉంటుంది.  మొత్తంగా చెప్పాలంటే ఒక పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటెర్టైనర్ వీరి నుండి రావడం ఖాయం. ఇక ఈ సినిమాకి  టెక్నీషియన్లు దాదాపుగా ఖరారయ్యారట. ప్రస్తుతం నటీనటులను ఎంపిక చేస్తోన్నట్లు తెలుస్తోంది.   ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ లో  మొదలు కానుందని.. రామోజీ ఫిల్మ్ సిటీలో వరుసగా ఇరవై  రోజులు పాటు సినిమాలోని  కొన్ని కీలక సన్నివేవాలను  షూట్ చేయనున్నారని తెలుస్తోంది.   ఈ సినిమాలో మెగాస్టార్  సరసన కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా తీసుకోనున్నారని  సమాచారం. కొరటాల శివ, మెగాస్టార్ కోసం ఓ  మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్న  స్క్రిప్ట్ ను  తయారు చేసారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: