సీనియర్ నటుడు, టాలీవుడ్ ముద్దు బిడ్డ నందమూరి తారకరామారావు. ఆయన స్టైల్ వేరు. ఆయనది గంభీర స్వభావం, విషయం ఏదైనా ముక్కు మీద చెప్పేస్తారు. తేడా వచ్చినంటే చాలు చండశాసనుడైపోతారు. ఆయనతో ఆ రోజుల్లో పనిచేసిన ఆర్టిస్టులు అవే ముచ్చట్లు చెబుతారు. రామారావు గారిలా డెడికేషన్  తో నటించే నటులూ ఇపుడు లేరు, ఆయనలా ముక్కుసూటితనం కూడా ఇపుడు లేదని అంటారు.


ఇక విషయానికి వస్తే సీనియర్ నటుడు గిరిబాబు తాజాగా  ఓ ఇంటర్వ్యూలో తనకు అన్న గారితో ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. అప్పట్లో అన్న నందమూరి సింహబలుడు మూవీ కె రాఘవేంద్రరావు డైరక్షన్లో చేస్తున్నారుట. మరో వైపు గిరిబాబు తాను నిర్మాతగా క్రిష్ణను పెట్టి సింహగర్జన మూవీ తీస్తున్నారుట. ఈ రెండు మూవీస్ కి టైటిల్ లో పోలిక ఉంది. పైగా రెండూ జానపదం జోనర్లో వస్తున్నవే. అంతే కాదు. ఒకదాంట్లొ రామారావు హీరో, మరో దాంట్లో క్రిష్ణ హీరో, ఈ ఇద్దరికీ అప్పటికే అల్లూరి సీతారామరాజు మూవీ విషయంలో బాగా  చెడింది. దాంతో ఆ గ్యాప్ అలా ఉండగానే  దాదాపుగా  ఒకే  టైటిల్, ఒకే జోనర్లో మూవీ అంటే నిజంగా ఇద్దరు టాప్ స్టార్స్ మధ్యన గొడవలే  మరి.


ఇక ఫ్యాన్స్ ఊరుకుంటారా. అసలు ఆగరు, గొడవలు ఓ వైపు  మొదలయ్యాయట. మరో వైపు గిరిబాబు మీద ఎన్టీయార్ కి కొందరు  కావాలని మోసుకెల్లీ చాడీలు చెప్పారట. అన్నగారి మీదకు  క్రిష్ణను ఎగదోస్తూ  సినిమా తీస్తున్న గిరిబాబు అంటూ ఎన్టీయార్ కి పితూరీలు బాగా చెప్పారట.  దాంతో  మాములుగానే అన్నగారికి గిరిబాబు మీద పట్టలేని ఆగ్రహం వచ్చిందట. దీంతో కంగారు  పడిన గిరిబాబు అన్న గారి  దగ్గరకు వెళ్ళి అసలు విషయం చెప్పడమే కాదు, మొత్తం తన సింహగర్జన సినిమా కధ కూడా వినిపించాడట.


కధ విన్న అన్నగారికి అసలు విషయం అర్ధమైందట. దాంతో శాంతించిన రామారావు తనకు గిరిబాబు మీద చాడీలు చెప్పిన వారి మీద అక్కడికక్కడే  మండిపడ్డారట.  గట్టిగా చీవాట్లు పెడుతూ కేకలు కూడా వేశారట. గిరిబాబు ఈ విషయాలను చెబుతూ ఏది మంచి ఏది చెడ్డ అని గ్రహించడమే కాదు, తప్పు చేసిన వారు తన పక్కన ఉన్నా దండించే  గుణం అన్న గారిలో ఉందని ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
         



మరింత సమాచారం తెలుసుకోండి: