ఒక యంగ్ హీరోకి వరసగా ఆరు ఫ్లాప్స్ వస్తే కనీసం అతడి గురించిన వార్తలు కూడ మీడియా పెద్దగా రాయదు. అయినా 6 ఫ్లాప్స్ వచ్చి కూడ సాయి తేజ్ నిలబదగాలిగాడు. ‘చిత్రలహరి’ తో తిరిగి ధైర్యం తెచ్చుకుని మళ్ళీ వరసపెట్టి సినిమాలు చేస్తున్న ఈ మెగా మేనల్లుడు ఏకంగా వెంకటేష్ ను లెక్కచేయక పోవడం ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది. 

వెంకటేష్ ‘వెంకీ మామ’ మూవీని సంక్రాంతి రేస్ లోకి వస్తున్నాడు అని తెలుసుకుని హడలిపోయిన ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురంలో’ మూవీ నిర్మాతలు కొందరు ప్రముఖ నిర్మాతల ద్వారా ‘వెంకీ మామ’ నిర్మాతలతో రాయబారాలు జరిపి ఆ మూవీని డిసెంబర్ 20 కి వచ్చే విధంగా ఇంచుమించు ఒప్పించారని తెలుస్తోంది. ‘వెంకీ మామ’ సోలో రిలీజ్ గా రావడానికి సహకరించడానికి అదే డేట్ కు రావలసి ఉన్న ‘96’ ‘భీష్మ’ ‘డిస్కోరాజా’ మూవీల విడుదలను వాయిదా వేయించగలిగారు అని తెలుస్తోంది. 

అయితే ఇదే డేట్ ను టార్గెట్ చేస్తూ ఇప్పటికే తన రిలీజ్ డేట్ ను ప్రకటించుకున్న ‘ప్రతిరోజు పండగే’ మూవీని వాయిదా వేయడానికి ఈ మూవీని నిర్మిస్తున్న బన్నీ వాస్ సహకరించడం లేదు అని వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఇదే డేట్ కు బాలకృష్ణ కె.ఎస్. రవికుమార్ ల మూవీ విడుదల కావలసి ఉన్న పరిస్థితులలో బాలయ్య గురించి కొందరు సందేహాలు వ్యక్త పరిస్తే ఇప్పుడు సాయి తేజ్ ‘వెంకీ మామ’ కు పోటీగా నిలుస్తానని చెప్పడం ఆశ్చర్య పరుస్తోంది.

తెలుస్తున్న సమాచారం మేరకు సాయి ధరమ్ తేజ్ ‘ప్రతిరోజు పండుగే’ మూవీని ‘వెంకీ మామ’ నుండి పోటీ తప్పించి డిసెంబర్ 27న సోలో రిలీజ్ గా విడుదల అయ్యే విధంగా రాయబారాలు నడుస్తున్నట్లు టాక్. అయితే సాయి తేజ్ ‘ప్రతిరోజు పండుగే’ మూవీ నిర్మాతలు ఈ రాయబారాలకు అంగీకరించి ‘వెంకీ మామ’ కోరుకుంటున్న సోలో రిలీజ్ డేట్ కు సహకరిస్తారో లేదో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: