రాజు గారి గది సిరీస్ లో ఇప్పటికే రెండు సినిమా లు వచ్చాయి ఫస్ట్ సినిమా సూపర్ హిట్ అయింది కానీ 2  సినిమాలో సమంత,నాగార్జున లాంటి స్టార్స్ ఉన్న కూడా సినిమా కలెక్షన్స్ పరంగా చాల ఇబంది పెట్టింది .ఇపుడు అదే ఓంకార్ తాజాగా ఈ సిరీస్ నుంచి 'రాజు గారి గది 3' సినిమా విడుదల చేశాడు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ విశేష ఆదరణ తెచ్చుకోవడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయింది. 


ఓవర్సీస్‌లో 'రాజు గారి గది 3' చిత్రాన్ని ఫార్స్ ఫిలిమ్స్ విడుదల చేసింది. ఈ రోజే  విడుదల కానున్న ఈ సినిమాను యూఎస్ ప్రేక్షకులు గత రాత్రే చేసేశారు. అయితే ఈ సినిమా చూసిన ఆడియన్స్ ఫస్ట్ టాక్‌ని బట్టి చూస్తే.. 'రాజు గారి గది 3' కొంతమేర పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నట్లే తెలుస్తోంది.

'రాజు గారి గది' సిరీస్ నుంచి వచ్చిన గత రెండు సినిమాలతో పోల్చితే కంటెంట్ పరంగా 'రాజు గారి గది 3' సినిమా సూపర్ గా ఉందనే టాక్ వినిపిస్తోంది.ఇదో అద్భుతమైన థ్రిల్లింగ్ కాన్సెప్ట్ అని అంటున్నారు.

రాజు గారి గది 3' సినిమాలో హారర్‌‌తో కామెడీ పుష్కలంగా ఉందని అంటున్నారు జనం. పాత బంగ్లాలో జరుగుతున్న వరుస సంఘటనల చుట్టే ఈ కథ అంతా తిరిగిందని, ఓంకార్ ఎంచుకున్న స్టోరీ లైన్ బాగుందనే టాక్ బయటకొచ్చింది.రాజు గారి గది 3' సినిమాకు స్క్రీన్ ప్లే వర్క్ అద్భుతంగా ఉందని అంటున్నారు జనం. ఎడిటింగ్ వర్క్ కూడా బాగుందనే టాక్ వినిపిస్తోంది. ఇవే సినిమాకు పాజిటివ్ పాయింట్స్ అని తెలుస్తోంది చూడాలి ఈ సినిమా బాక్సాఫీస్ దెగ్గర ఎలా పని చేస్తుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: