మెగాస్టార్ చిరంజీవి సైరా ఇపుడు తెలుగునాట ధియేటర్లలో ఉంది. ఆ మూవీ తెలుగువరకూ హిట్, పాన్ ఇండియా మూవీ కాస్తా మెగాస్టార్ మూవీగా మారిపోయింది. దాంతో చిరు ఫ్యాన్స్ మూవీని భుజాల మీద మోశారు. తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి మూవీ చాలా కాలానికి రావడం, డిఫరెంట్ జోనర్లో మూవీ ఉండడంతో మొత్తానికి హిట్ పట్టాలెక్కించేశారు. ఆ విధంగా మెగా క్యాంప్ హాపీ.


ఇక చిరంజీవి తరువాత మూవీ అంటే 152 సినిమా మీదనే అందరి కళ్ళూ ఉన్నాయి. ఈ మూవీ కొరటాల శివ డైరెక్షలో ఉండబోతోంది. ఈ మూవీ తొందరలోనే సెట్స్ మీదకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మూవీలో కధ రెడీ, కాస్టింగ్ రెడీ, కానీ మెగాస్టార్ పక్కన నటించే హీరోయిన్ మాత్రం సెలెక్ట్ కాలేదు. దానికి కారణం మెగా హీరో పక్కన జత కట్టే విధంగా హీరోయిన్లు దొరకక‌పోవడమే.


దీంతో  దాదాపు పుష్కర కాలం క్రితం స్టాలిన్ మూవీలో చిరంజీవితో చిందేసిన త్రిషను హీరోయిన్ గా పెట్టాలనుకుంటున్నట్లుగా లేటెస్ట్ టాక్. సిగ్గుతో చీ చీ అంటూ మెగాస్టార్ తో అప్పట్లో త్రిష డ్యూయెట్లు పాడింది. ఆ మూవీ హిట్ కాకపోయినా చిరంజీవి, త్రిష జంటకు మంచి పేరు వచ్చింది. ఆ తరువాత మెగాస్టార్ రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు, ఇక  ఆమెతో మళ్లీ నటించలేదు.


ఇన్నాళ్ళకు కొరటాల శివ, మెగా కాంబోలో ఆ అవకాశం వస్తోందని అంటున్నారు. ఈసారి కూడా త్రిష చిరంజీవితో డ్యూయెట్లు పాడుతుందని అంటున్నారు. సిల్వర్ స్ర్కీన్ రేసులో  త్రిష ఇపుడు బాగా వెనకబడింది. ఆమె మూవీస్ కూడా పెద్దగా లేవు. ఈ నేపధ్యంలో మెగాస్టార్ పక్కన అంటే నిజంగా ఆమెకు ఇది గోల్డెన్ చాన్సే. ఈ మూవీతో క్లిక్ అయితే మళ్ళీ సీనియర్ హీరోలతో ఇంకో రౌండ్ వేసేయడానికి, చాన్సులు రావడానికి అవకాశం ఉంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: