బిగ్ బాస్ 3 హౌస్‌లో కంటెస్టంట్స్ బంధువులను ఇంటిలోకి పంపుతూ - వారిని ఫుల్ ఎమోషనల్ చేసే టాస్క్ ఇవ్వడం జరిగింది. మొదట రోజు టాస్క్‌లో వితికా, అలీ, శివజ్యోతి, బాబా భాస్కర్ కుటుంబ సభ్యులను ఇంటిలోకి రావడం జరిగింది. ఇక గురువారం ఎపిసోడ్ లో మాత్రం
వరుణ్ వాళ్ళ బామ్మ,
రాహుల్ అమ్మ, శ్రీముఖి అమ్మ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇక మొదట వచ్చిన
వరుణ్ బామ్మ...ఇంటిలో చాల సరదాగా గడిపారు అందరితోనూ.
ఆ తర్వాత
రాహుల్ వాళ్ళ తల్లి కన్ఫెషన్ లో రూమ్ లో ఉండి రాహుల్, రాహుల్ అని పిలిచారు. నేను ఇక్కడ ఉన్నాను
రాహుల్ నా దగ్గరికి రానాన్న అని పిలవడం జరిగింది. దీంతో
రాహుల్ పరుగెత్తుకుంటూ తల్లి దగ్గరకు వెళ్లి వడిలో ఒదిగిపోయాడు. ఇక రాహుల్‌ని వాళ్ళ అమ్మ నీవు బాగా
గేమ్ ఆడమని చెప్పారు. ఇక హౌస్ లో బాబా
భాస్కర్ వంట చేయడం, శ్రీముఖి అల్లరి చేయడం అంటే నాకు బాగా ఇష్టం అని చెప్పుకొని వచ్చారు.
ఇక అందరి కంటెస్టంట్స్ తో
రాహుల్ మనసు చాల మంచిది, మనసులో ఒకటి పెట్టుకొని, బయటకి ఇంకోలాగా మాట్లాడాడు అని తెలియచేసారు అందరికి. ఇంకా చివరికి
రాహుల్ అమ్మ కోసం పెదవే పలికిన తీయని మాటే అమ్మ అంటూ పాట పాడి అమ్మని మైమరిపించాడు.ఇక శ్రీముఖిని మాత్రం బిగ్ బాస్ ఎమోషన్ తో ఓ
గేమ్ ఆడుకున్నాడు అంటే నమ్మండి. ఆమెని పవర్ సేవ్ మోడ్ లో ఉంచి శ్రీముఖి వాళ్ళ అమ్మను హౌస్‌లోకి పంపించారు - కొద్దీ సేపటికే అదే గేటు నుండి బయటకు వెళ్లిపోవాలని తెలిపారు బిగ్ బాస్. దీంతో శ్రీముఖికి ఒక్క సరిగా తన ఏడుపును ఆపుకోలేక పోయింది. అమ్మ అమ్మ అంటూ బోరున ఏడిచేసింది.
కానీ మళ్ళీ కొంచం సమయం తరవాత శ్రీముఖి అమ్మని ఇంకో డోర్ నుంచి ఇంటిలోకి పంపించడం జరిగింది. అమ్మ ఇంట్లోకి రావడంతో శ్రీముఖి ఆనందానికి హద్దులు లేవు ఇంకా. తర్వాత శ్రీముఖి వాళ్ళ అమ్మ ఇంటి సభ్యులతో మాట్లాడుతూ..
రాహుల్ నువ్వు బిగ్ బాస్ హౌస్ కి శ్రీముఖి తో పాటు వెళ్తున్నావు అంటే శ్రీముఖికు తోడు ఉంటావ్ అని బాగా సంతోష పడ్డాను. కానీ నువ్వు శ్రీముఖిని అంటున్న మాటలను చూసి నాకి బాగా బాధ వేస్తుంది అని
రాహుల్ కు తెలిపారు. ఇక చివరికి అందరి లాగానే శ్రీముఖి అమ్మ కూడా హోటల్ టాస్క్‌లో భాగంగా బాబా ఇచ్చిన టీ నచ్చడంతో బిగ్ బాస్ హోటల్ కి స్టార్ ఇస్తున్న అని తెలియచేసారు. చివరికి అందరికి అల్ ది బెస్ట్ చెప్తూ బిగ్ బాస్ నుంచి వెళ్లిపోతున్నారు.