టాలీవుడ్ లో  సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణకు మాస్‌లో ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు.తన తండ్రి మీద తీసిన సినిమా మహా నాయకుడు మరియు కథానాయకుడు తర్వాత వస్తున్న నూట ఐదవ  చిత్రం రూలర్ లో ప్రస్తుతం నటిస్తున్నారు. ఈ సంవత్సరం టిడిపి ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ బాలకృష్ణ గారు హిందూపురం నియోజకవర్గం నుంచి గెలుపొందిన విషయం అందరికి తెలిసినదే అలాగే ఆయన తన తల్లి గారి జ్ఞాపకార్థం బసవతారకమ్మ క్యాన్సర్ ఆస్పత్రి నడిపిస్తున్న విషయం అందరికీ తెలిసినదే.

తాజాగా ఆయన్ని అభిమానించే చిన్నారి అభిమాని గోకుల్.. డెంగ్యూ కారణంగా కన్నుమూసాడు. తెలుగులో జీ తెలుగులో ప్రసారమయ్యే డ్రామా జూనియర్ కార్యక్రమంలో అచ్చంగా బాలకృష్ణలా గోకుల్ చెప్పే డైలాగులకు ప్రేక్షకులు ఎంతో ఫిదా అయ్యారు. గోకుల్ డెంగ్యూతో బాధపడుతూ బెంగళూరులోని ఓ ప్రైవేటు హాస్పటల్‌లో కన్నుమూసాడు. గతంలో గోకుల్ తన అభిమాన నటుడు బాలకృష్ణను కలిసి ఆయన ఆశీర్వాదం కూడా తీసుకున్నాడు. చిన్నారి గోకుల్ మరణంతో బాలయ్య ఒకింత భావోద్వేగానికి గురయ్యారు ఈ సందర్భంగా తన బాధను అభిమానులతో పంచుకున్నారు.


నేనంటే ప్రాణం ఇచ్చే ఈ చిన్నారి ఈ రోజు ప్రాణాలతో లేడన్న నిజం నా మనసును కలిచివేసింది. ఆ చిన్నారి డైలాగులు చెప్పే విధానం.. హావభావాలు చూసి నాకు ఎంత ముచ్చటేసిది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ చిన్నారి ఇంత చిన్న వయసులో డెంగ్యూ వ్యాధితో ఈ లోకాన్ని విడిచి వెళ్లడం చాలా బాధ కలిగించింది.

ఈ చిన్నారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ లేఖ విడుదల చేసారు. గోకుల్ విషయానికొస్తే.. ఆయన స్వస్థలం చిత్తూరు జిల్లా మదనపల్లె. తండ్రి యోగేంద్రబాబు,తల్లి సుమాంజలి. మొదటి నుంచి బాలకృష్ణలా డైలాగులు చెబుతూ ఇంటి పక్కనవారిని అలరిస్తూ అలా టీవీల్లో ప్రోగ్రామ్స్ ఇచ్చే స్థాయికి ఎదిగాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: