బిగ్‌బాస్ తమిళ్ లో  నటుడు కమల్‌హాసన్‌ హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే.అయితే ఇపుడు నటుడు  కమల్‌హాసన్‌పై నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ మీరా మిథున్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు కోలీవుడ్‌లో సంచలనంగా మారింది. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేసిన మీరా.. కమల్ హాసన్ అనుకున్నది సాధించారంటూ ట్వీట్ చేసింది.అంటే ఆయనకు బంధుప్రీతి ఎక్కువని.. తనకు వచ్చిన ఆఫర్‌ను కమల్, తన కూతురు ఇప్పించాడంటూ ఆమె ఆరోపణలు చేసింది.


వివరాలలోకి వెళితే .. మీరా మిథున్ కథానాయికగా ‘అగ్ని సిరాగుగల్’ అనే సినిమాలో నటించాల్సి ఉంది. ఆమె ప్లేస్‌లో కమల్ హాసన్ చిన్న కుమార్తె అక్షరా హాసన్‌ను ఎంపిక చేసుకున్నారట.సినిమా నుంచి నన్ను తప్పించి తన కూతురికి అవకాశం వచ్చేలా చేశారు కమల్ హాసన్. ఇలా చేసినందుకు దర్శకుడు నవీన్‌కు, అక్షరా హాసన్‌కు, నిర్మాత శివకు సిగ్గుగా అనిపించడంలేదా? అంటు ఆరోపణలు చేసింది.


అయితే సినిమాలో ఆమెను తీసుకున్నట్లే తీసుకుని ఆ తర్వాత తొలగించేశారట. వారికి డబుల్ స్టాండర్డ్స్ బుద్ధి ఉందని బాగా తెలుస్తోంది’ అని మీరా ట్వీట్ చేసింది. 
అయితే మీరా చేస్తున్న ఆరోపణలపై దర్శకుడు నవీన్ స్పందించారు. ‘అగ్ని సిరాగుగల్ సినిమాలో మొదట షాలినీ పాండేను ఎంపిక చేసుకున్నాం.అసలు సినిమాలో మీరా మిథున్‌ను ఎంపిక చేసుకోలేదు.  ఇప్పుడు ఈ సినిమాలో అక్షర హాసనే కథానాయిక. అంటూ కొత్త సస్టేట్మెంట్ ఇచ్చారట. వివరాలలోకి వెళితే .. నా అనుమతి లేకుండా సినిమాలో తనను ఎంపిక చేసుకున్నామని మీడియా ముందుకు వచ్చి ఆరోపిస్తోంది. మొదట నేను ఆమె మాటలు పట్టించుకోకూడదని అనుకున్నాను. కానీ ఆమె చేస్తున్న రాద్దాంతం వల్ల స్పందించాల్సి వస్తోంది అని తెలిపారు నవీన్.

అయితే ఈ వివాదం గురించి కమల్, అక్షరా నుంచి ఎలాంటి స్పందన లేదు. మరి.. స్పందిస్తారో? సైలెంట్‌గా ఉండిపోతారో చూడాలి అంటూ ఫాన్స్ చెప్తున్నారు. అది కనుక నేను బయటపెడితే మీకొక్కరికే కాదు మీ కుటుంబంలో ఉన్న స్త్రీల మీద కూడా ఆ ప్రభావం పడుతుంది. మరి.. నేను బయటపెట్టనా? ఎదుర్కొనే గట్స్‌ మీకున్నాయా?’’ అని ట్వీట్‌ చేశారు మీరా. అందుకు నవీన్‌ నుంచి సమాధానం రాకపోవడంతో ‘‘ఏమైంది నవీన్‌ కుమార్‌. ఎందుకు సైలెంట్‌ అయిపోయారు. అని ఇష్టంవచ్చినట్లు ట్వీట్ చేసిన బిగ్‌బాస్ హీరోయిన్.ఇలా వాడివేడి ట్వీట్స్‌తో మీరా మిథున్‌ టాక్‌ ఆఫ్‌ కోలీవుడ్‌ అయ్యారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: