బిగ్ బాస్ 3 ఇప్పటికే పదకుండు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకొని,12వ వారంలోకి అడుగుపెట్టింది.మరి కొద్ది రోజుల్లో బిగ్ బాస్ 3 విన్నర్ ఎవరో తెలిసి పోతుంది.అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం,రాహుల్‌ ఏ లీడ్ లో ఉన్నట్టు,తనకే విన్నర్ అయ్యే అవకాశాలు పుష్కలంగా  ఉన్నాయని,మా మ్యూజిక్ వాళ్ళు జరిపిన సర్వే లో తెలిసింది.


 షో పూర్తికాతనికి ఇంకా కేవలం రెండు వారాలే మిగిలి ఉన్నాయి.ఈ వరం ఎలిమినేషన్ అనంతరం,చివరి వారంలో హౌజ్‌లో ఐదుగురు మాత్రమే ఫైనల్‌కు చేరుకుంటారు. దీంతో ఈ  వారం వితికా, శివజ్యోతి లేదా బాబా భాస్కర్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అయితే ఈ ముగ్గురిలో తక్కువ ఓట్లుతో  వితికా  ఎలిమినేట్  కానుందిఅని అంటున్నారు నెటిజన్స్. 


ఇది ఇలా ఉంటే టైటిల్ విన్నర్ వరసలో,ముందుగా  రాహుల్, అలీ రెజా, బాబా బాస్కర్, శ్రీముఖి,వరుణ్ సందేశ్‌లు ఉన్నారని,పైగా  మొదటి నుండి రాహుల్‌ను  శ్రీముఖి టార్గెట్ చేస్తూ వస్తుంది అని, కావాలని రాహుల్‌ను రెచ్చగొట్టింది అని అంటున్నారు నెటిజన్లు. దాంతో శ్రీముఖి పై ఆడియన్స్‌లో బాగా నెగిటివ్ ఇమేజ్ డెవలప్ అయింది అని,వరుణ్  విషయానికి వస్తే, హౌజ్‌లో అందరితో కలివిడిగా ఉంటూ,పెద్ద మనిషి తరహాలో ప్రవర్తిస్తూ,ఇంట్లో జరిగే ఏ  గొడవ అయినా తాను శాంతంగా డీల్ చేస్తూ వచ్చాడు అని అంటున్నారు అయన అభిమానులు. కానీ ఈ మధ్య తన భార్య వైపు కొంత పక్షపాతం చూపిస్తున్నారని,మొన్న జరిగిన ఎపిసోడ్లో క్లియర్ గా అర్ధం అయిందిఅని కొంతమంది చెప్పుకొచ్చారు. 


 కానీ రాహుల్ మాత్రం ఇప్పటిదాకా  అందరూ తనని టార్గెట్‌ చేసి,కిందకు దించే ప్రయత్నం చేసినా  స్ట్రాంగ్‌గా నిలబడుతూ,ఇక్కడి దాకా చేరుకొన్నారు. దానికి తోడు .  ప్రేక్షకులు అండ కూడా గెట్టిగా ఉందని తెలుస్తుంది,అందుకే ఎన్నిసార్లు నామినేట్ అయినా,సేఫ్ అవుతూ వచ్చారు. దీనిలో భాగంగానే రాహుల్‌కు రోజు రోజుకు ఓట్ షేరింగ్ పెరుగుతూ  వస్తోంది. దీంతో బిగ్‌బాస్  తెలుగు మూడవ సీజన్ విజేత రాహుల్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: