దిల్ రాజు కాంపౌండ్ నుండి ఒక డైరెక్టర్ వస్తున్నాడంటే ఖచ్చితంగా అతను టాలెంటెడ్ డైరెక్టర్ అని ఫిక్సవ్వాల్సిందే. అలా వచ్చిన వాళ్ళలో శ్రీకాంత్ అడ్డాల ఒకరు. తన మొదటి సినిమా కొత్త బంగారు లోకం అంటు యూత్ సినిమా తీసినప్పటికి ఏమాత్రం వల్గారిటి లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్ అందరు చూసేలా తెరకెక్కించి ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత మల్టిస్టారర్ గా విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ తో తెరకెక్కించిన సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు ఇండస్ట్రీ రికార్డ్ గా మిగిలింది. దీంతో శ్రీకాంత్ పేరు మార్మోగిపోయింది. అందుకనే ఏకంగా సూపర్ స్టార్ మహేష్ తో బ్రహ్మోత్సవం అనే సినిమా తీశాడు. 

భారీ తారాగణంతో రూపొందించిన ఈ సినిమా పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. అంతేకాదు కమర్షియల్ గా మహేష్ కి పెద్ద దెబ్బ పడింది. అంతే మళ్ళీ ఇంతవరకు శ్రీకాంత్ కనపడలేదు. అయితే ఇండస్ట్రీలో మంచి సక్సస్ లో ఉన్నదర్శకులకే డిమాండ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. అదే ఒక సినిమా గనక ఫ్లాప్ అయితే ఇక ఆ సినిమా దర్శకుడికి ఎంత టాలెంట్ ఉన్న సరే, అంత తేలిగ్గా అవకాశాలు రావు. మొదటి సినిమాకోసం చెప్పులు అరిగేలా తిరిగినట్టు తిరగాల్సిందే. ఇక ఎట్టకేలకు బ్రహ్మోత్సవం ప్లాప్ తరువాత శ్రీకాంత్ కి మాత్రం మరో సినిమా మొదలుపెట్టడానికి మూడు సంవత్సరాలు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఆ మధ్య శ్రీకాంత్ అడ్డాల నానితో సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి.

కానీ అవి ఫేక్ అని నానినే సోషల్ మీడియాలో ప్రకటించాడు. ఇంతకీ శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎప్పుడు అని నెటిజన్లు ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం శ్రీకాంత్ అడ్డాల త్వరలోనే కొత్త సినిమాని పట్టాలెక్కించడానికి జోరుగా ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుస్తోంది. వరుణ్ తేజ్ తో గాని, నానితో గాని సినిమా ఉండొచ్చు అని ఈ సినిమాని గీతా ఆర్ట్స్ నిర్మిస్తుందని తెలుస్తోంది. ఒకవేళ అదే గనక నిజమైతే శ్రీకాంత్ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చే అవకాశం ఉందనిపిస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: