తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని  హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇక ఈయన సినిమా వచ్చిందంటే బాక్సాఫీస్ దగ్గర రికార్డుల వర్షం కురిపిస్తుంటుంది. మహర్షితో 100 కోట్లు దాటేసి తన సత్తా చూపించాడు సూపర్ స్టార్. ఇక ఈయన 25వ చిత్రంగా వచ్చిన 'మహర్షి' సినిమా థియేటర్స్‌లో మంచి విజయం సాధించింది. యావరేజ్ టాక్‌తో ఓపెన్ అయినా కూడా చివరికి 100 కోట్లకు పైగా షేర్ సాధించి హిట్ అనిపించుకుంది మహర్షి.

ఈ చిత్రానికి ఇప్పుడు ఊహించని షాక్ తగిలింది. బుల్లితెరపై మహర్షి దారుణంగా నిరాశపరిచింది.సాధారణంగా మహేష్ బాబు సినిమాలకు బుల్లితెరపై మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. థియేటర్స్‌లో ఫ్లాప్ అయిన నేనొక్కడినే, ఖలేజా లాంటి సినిమాలు బుల్లితెరపై బ్లాక్ బస్టర్ అయ్యాయి. కానీ మహర్షి లాంటి హిట్ సినిమాకు బుల్లితెరపై కనీసం స్పందన రాలేదు. రైతుల నేపథ్యంలో వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని జెమినీ ఛానెల్ భారీ రేట్ ఇచ్చి శాటిలైట్ రైట్స్ తీసుకుంది.

ఈ మద్యే ఫస్ట్ టైమ్ టెలికాస్ట్ చేసారు. తొలిసారి కావడం.. మహేష్ బాబు హీరో కావడం.. అన్నింటికి మించి 25వ సినిమా కావడంతో కచ్చితంగా దీనికి టీఆర్పీ పేలిపోతుందని.. కనీసం 15-20 మధ్యలో వస్తుందని ఊహించారు.కానీ ఎవరూ ఊహించని విధంగా 8.4 రేటింగ్ రావడం జీర్ణించుకోలేకపోతున్నారు ఛానెల్ యాజమాన్యం.

సూపర్ స్టార్ సినిమాకు 10 లోపే రేటింగ్ రావడమేంటి అని వాళ్లు తల పట్టుకున్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు. మహర్షి సినిమా ఇదివరకే అమేజాన్‌లో విడుదల కావడంతో అంతా అక్కడ చూసారు. దాంతో ఇప్పుడు టెలివిజన్ ప్రీమియర్ వేసినా కూడా పెద్దగా రెస్పాన్స్ రాలేదు. దానికితోడు సమ్మర్ విడుదల కాబట్టి అప్పుడే చాలా మంది మహర్షిని చూసేసారు. .


మరింత సమాచారం తెలుసుకోండి: