జబర్దస్త్ కామెడీ షో లో హైపర్ ఆది స్కిట్స్  మరియు సుడిగాలి సుధీర్ స్కిట్స్ చాల బిన్నంగా,పూర్తిగా నవ్వించేలా ఉంటాయన్న సంగతి అందరికి తెలిసిందే.వాళ్ళు  వేసే పంచ్‌లు, ప్రాసలకు జడ్జిలు నాగబాబు, రోజా సైతం పగలబడి నవ్వుకుంటారు.హైపర్ ఆది  స్కిట్స్  ద్వారా ఎంతగా  నవ్విస్తారో,అంతగా  వివాదాల్లోనూ ఉంటూఉంటారు.ప్రతి వారం ప్రేక్షకులను తమ హాస్యంతో అలరిస్తూ,దూసుకుపోతున్న కామెడీ షో ఒక్క జబర్దస్త్ అని చెప్పచు.ఆ షోకి అంతే క్రేజ్ కూడా ఉంది.

చిన్న పిల్లలు  దగ్గరి నుండి,ముసలివాళ్ల వరకు ఎందరో అభిమానులు ఉన్నారు ఈ షోకి. ప్రతి గురువారం, శుక్రవారం వచ్చిందంటే చాలు ఈటీవీ కి  అతుక్కుపోతారు ప్రేక్షకులు. అందులో చాలా మంది,జబర్దస్త్  షో యాంకర్స్ అయిన అనసూయ, రష్మీ ఇంట్రడక్షన్ సాంగ్ కోసమే   చూస్తారని చెప్పచు.ఇక,  కామెడీ షోలో టీమ్ లీడర్లకు ఒక్కో పేరు.అంతే కాకుండా,హాస్యం పండించటంలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. చమ్మక్ చంద్ర, సుడిగాలి సుధీర్, రాకెట్ రాఘవ, హైపర్ ఆది,చలాకి చంటి,వెంకీస్ మంకీస్ అని ఇలా ఆయా టీమ్‌లు జబర్దస్త్‌తోనే కాకుండా,ఎక్స్‌ట్రా జబర్దస్త్  పేరుతో కామెడీని అందిస్తున్నారు ప్రేక్షకులకు. 

అయితే,అందరు ఒక ఎత్తు అయితే,హైపర్ ఆది స్కిట్స్ మరింత ప్రత్యేకం.అతడు  అలవోకగా వేసే పంచ్‌లు కానీ, ప్రాసలకు కానీ జడ్జిలు నాగబాబు, రోజా సైతం పగలబడి నవ్వుకుంటారు. ఆది ఎంతగా  నవ్విస్తాడో, అంతే తొందరగా  వివాదాల్లోఉంటారు.ఇదివరకు  కామెడీ స్కిట్‌లో భాగంగా రోజాపై వ్యాఖ్యలు చేసారు,తర్వాత షోలో దేశంలోని స్త్రీలపై  కూడా అభ్యంతర వ్యాఖ్యానాలు చేసి పలు వార్తల్లో నిలిచారు ఆది.

అయితే  తాజాగా వచ్చే వారం విడుదుల కానున్న హైపర్ ఆది స్కిట్ ప్రోమోను విడుదల చేశారు. అందులో ఆదితో పాటు, ఆటో రాంప్రసాద్ కూడా ఓ పాత్ర చేస్తున్నారు.స్కిట్ లో  భాగంగా,తాను చెప్పిందే ఆది మరలాచెప్తున్నారని ఆటో రాంప్రసాద్ అనగా,మరి ఏడేళ్ల పాటు నువ్వు కూడా తిప్పి తిప్పి అవే స్కిట్‌లు చెయ్యట్లేదా అని అన్నారు.దీనితో అందరు ఒక్కసారిగా షాక్‌కు గురవుతారు. ఆ వెంటనే నాగబాబు, రోజా నవ్వడంతో స్కిట్ ముందుకు సాగింది. ఇలా అనేక  సందర్భాల్లో వేరే వాళ్ల స్కిట్లపై హైపర్ ఆది వెరైటీ వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: