తెలుగు ఇండ‌స్ట్రీలో ఈమధ్య  సీక్వెల్స్ ని బాగా ఫాలో అవటంతో,సినిమా హిట్ అయినా,ప్లాప్ అయినా వాటి కొన‌సాగింపు క‌థ‌లు మాత్రం ఆపటం లేదు  దర్శక నిర్మాతలు. ఓంకార్  సీక్వెల్ గా వచ్చిన  రాజు గారి గది3 మూవీ రిలీజ్ కావటంతో,ప్రేక్షకులు మూవీపై  ఎలా స్పందించారో చూద్దాం.నాగార్జున హీరోగా స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన,రాజుగారిగ‌ది 2 కి మంచి టాక్ వచ్చిన అనుకున్నంతగా  మెపించలేకపోయారు.ఇపుడు తాజాగా  తన తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా,అవికా గోర్ హీరోయిన్‌గా నటించిన  రాజు గారి గది త్రీ నేడే రిలీజ్ అయింది.
 
సినిమా కధ విషయానికి వస్తే,హీరో అశ్విన్ బాబు ఒక ఆటో డ్రైవర్.తాను అందరిని ఇబ్బంది పెడ్తూ ఉంటాడు.అలాంటి తనికి హీరోయిన్ డాక్టర్  అయిన మాయ (అవికా గోర్) తో పరిచయం ఏర్పడుతుంది.మాయను ఒక్క దెయ్యం  ఎప్పుడు వెంటాడుతూ,విసిగిస్తూ  ఉంటుంది. ఆమెను ప్రేమించా అన్న వ్యక్తుల తాట తీస్తూ ఉంటుంది. అలాంటి సందర్భంలో అశ్విన్, హీరోయిన్ మాయని  కలుస్తాడు.తర్వాత  తన ప్రేమను మాయకు వ్యక్తం చేస్తాడు.ఇక మాయను ఎపుడు నీడలా వెంటాడే ఆ దెయ్యం,హీరో అశ్విన్  ఏం చేసింది అన్నదే  రాజు గారి గది 3  మిగతా స్టోరీ. 
అశ్విన్ బాబు,తన క్యారెక్టర్ ను తన కున్న పరిధిలో బాగానే నటించారు.చాలా రోజుల తర్వాత  తెలుగులో,అవికా గోర్  కథానాయికగా నటించింది. ఒక్క క్లైమాక్స్ సీన్ తప్పా అవికా గోర్‌కు పెద్దగా  ఛాన్స్ దొరకలేదు అని చెప్పచు. ఆలీ, బ్రహ్మాజీ కామెడీ  చాలా బాగుంది.ఇక సెకండాఫ్‌ లో ఊర్వశి,అజయ్ ఘోష్ నటన ఈ సినిమాకు ప్లస్ అంటున్నారు.

 ఈ సినిమాకు ఎక్కువగా హార్రర్ కామెడీని జోడించారు. దెయ్యాలతో కామెడీ చెయ్యడం, కొంచెం అతిగా ఉన్నా,కథలో భాగంగానే  కామెడీ రావటంతో అది కలిసిపోయింది.. మరోవైపు ఆటో డ్రైవర్‌ను,అంత పెద్ద డాక్టర్ ప్రేమించడమనేది అంత  కన్విన్సింగ్‌‌‌గా అనిపించకపోయినా,సినిమాలో ఇలాంటివి సహజంతో పర్వాలేదు అనిపిస్తుంది. మొత్తంగా  హార్రర్ కామెడీతో ఓంకార్ భయపెట్టలేకపోయిన,నవ్వించడం ఖాయం అంటున్నారు. చోటా కే.నాయుడు కెమెరా పనితనం ఈ సినిమాకు పెద్ద అసెట్.షబీర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మేపించినటు తెలుస్తుంది. లాజిక్కులు లేనిదే సినిమా కాబ్బటి,రాజు గారి గది 3 ప్రేక్షకులను  డిసపాయింట్ చేయదని చెప్పచు.


మరింత సమాచారం తెలుసుకోండి: