తమిళ సూపర్ స్టార్ విజయ్ గత కొంత కాలంగా తెలుగులో మంచి విజయాలు అందుకుంటున్నారు.  ఆ మద్య తమిళంలో సూపర్ హిట్ అయిన మెర్సిల్ తెలుగు లో ‘అదిరింది’ పేరు తో రిలీజ్ చేశారు.   ఈ మూవీ మొదటి నుంచి ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నా థియేటర్లోకి వచ్చిన తర్వాత తన విశ్వరూపాన్ని చూపించింది.  ఈ మూవీలో వైద్యంతో కొంత మంది పెద్దమనుషులు చేస్తున్న అన్యాయాలపై చిత్రీకరించారు.  అలాగే జీఎస్టీ ప్రభావం కూడా చూపించారు. ఈ నేపథ్యంలో తమిళనాటనే కాదు తెలుగు రాష్ట్రాల్లో సైతం వ్యతిరేకత వచ్చింది. కానీ థియేటర్లో మాత్రం దుమ్మురేపింది.


ఆ తర్వాత మురుగదాస్ దర్శకత్వంలో ‘సర్కార్’ సినిమా వచ్చింది.  ఈ మూవీ కూడా ఎన్నో కాంట్రవర్సీలు ఎదుర్కొంది.  ఈ ఏడాది దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగడం..ఈ నేపథ్యంలో సినిమా ఎన్నికలపై..కొంత మంది రాజకీయ నాయకులు ఓటర్లను ఎలా ప్రలోభ పెట్టి తర్వాత ఐదేళ్లు పాలన కొనసాగిస్తున్నారు..ఎలా దోచుకుంటున్నారు అన్న కాన్సెప్ట్ తో వచ్చింది.  ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు వేయాలని..సరైన నాయకుడిని ఎన్నుకొని మన సర్కార్ మనమే ఏలుకోవాలని సందేశంతో ఈ సినిమా తెరకెక్కించారు మురుగదాస్.  ఈ సినిమాపై కూడా ఎన్నో విమర్శలు, వ్యతిరేకత వచ్చినా థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత బ్లాక్ బస్టర్ అయ్యింది.


తెలుగు లో కూడా ఘనవిజయం సాధించింది. తాజాగా అట్లీ కుమార్ దర్శకత్వంలో విజయ్ హీరోగా ‘బిగిల్’ రూపొందింది. ఫుట్ బాల్ క్రీడా నేపథ్యంలో నిర్మితమైన ఈ సినిమాలో, విజయ్ జోడీగా నయనతార నటించింది. దీపావళి కానుకగా తమిళంలో ఈ సినిమాను ఈ నెల 25వ తేదీన విడుదల చేస్తున్నారు.అదే రోజున ఈ సినిమాను తెలుగులో 'విజిల్' పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ  మహేశ్ కోనేరు  తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. గతంలో అట్లీ కుమార్ — విజయ్ కాంబినేషన్లో వచ్చిన 'తెరి' .. 'మెర్సల్' ఘన విజయాలను సొంతం చేసుకోవడంతో, సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ పడుతుందేమో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: