ఫిల్మ్ ఇండస్ట్రీలో నటీ నటుల మధ్య లవ్, బ్రేకప్, మ్యారేజ్..డివోర్స్ అన్ని సర్వసాధారణం. అంతేకాదు స్టార్ హోదా వచ్చాక ఏజ్ తో సంబంధం లేకుండా లవ్ చేసుకోవడం.. డేటింగ్ లో ఉండటం మాములుగా జరుగుతుంటాయి. ఇప్పుడు అలానే ఒక ఆసక్తికరమైన జంట రొమాన్స్ లో పీక్స్ అంటు జల్సా చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు, మోడల్
మిలింద్ సోమన్ తన భార్య అంకితా కోన్వార్తో కలిసి ఐస్‌ల్యాండ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడి ఫేమస్ బ్లూ లగూన్లో వీరిద్దరూ కలిసి రొమాంటిక్‌గా దిగిన ఫొటోలను మిలింద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఇవి బాగా వైరల్ అవుతున్నాయి. 'ఐస్‌ల్యాండ్‌లోని బ్లూ లగూన్లో మేం ఇలా.. బయట వాతావరణం ఉష్ణోగ్రత 3 డిగ్రీలు ఉంది. కానీ ఈ లగూన్లో 30 డిగ్రీలు వెచ్చగా ఉంది' అని తమలోని రొమాంటిక్ యాంగిల్ ని చూపిస్తున్నారు. వీరి ఫొటోలపై నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం సంచలనం అవుతోంది.
53 ఏళ్ల వయసులోనూ మిలింద్ సోమన్ ఎంతో హ్యాండ్సమ్గా ఉంటాడని అతన్ని చూస్తుంటే తెలుస్తుంది. అందుకే ఆయనకు బాలీవుడ్లో క్రేజ్ బాగా ఉంది. అయితే ఎప్పుడైతే మిలింద్..తన కూతురు వయసున్న అంకితా కోన్వార్‌ను పెళ్లి చేసుకున్నాడో అప్పటి నుంచి వీళ్ళు హాట్ టాపిక్‌గా మారారు. గతేడాది మిలింద్, అంకితా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మిలింద్కు అంతకుముందే పెళ్లై వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు. ఆ తర్వాత మిలింద్ అంకితను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలిసి ఫ్యాన్స్ షాకయ్యారు. తనకంటే చిన్న వయసున్న అమ్మాయితో ప్రేమ, పెళ్ళేంటి? అని డైరెక్ట్ గానే కామెంట్స్ చేశారు.
ఆ కామెంట్స్ కి సమాధానంగా.. సమాజం ఎప్పుడూ ఇతరులను వేలెత్తి చూపుతూనే ఉంటుందని, ప్రేమకు వయసుతో సంబంధం లేదని మిలింద్ రివర్స్ లో ఇచ్చిన సమాధానం అందరిని షాకయ్యోలా చేసింది. ప్రస్తుతం మిలింద్-అంకితా తమ వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. కార్తి నటించిన మొదటి సినిమా 'ఆవారా' లో మిలింద్ విలన్ పాత్రలో నటించారు. బాలీవుడ్లో కూడా చాలా సినిమాల్లో నటించారు. మిలింద్ చివరిగా 'ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్' అనే వెబ్ సిరీస్‌లో నటించారు. అంతేకాదు ఆయన ప్రపంచంలోనే నెంబర్ వన్ మారథాన్ రన్నర్లలో ఒకరన్న విషయం కూడా తెలిసిందే. అంతేకాదు 50 ఏళ్ళ వయసులోనూ మిలింద్ నిర్విరామంగా 100 పుషప్స్ చేయగలరు. ఒకరకంగా చెప్పాలంటే మిలింద్ సినిమాలకంటే ఫిట్నెస్ పరంగానే బాగా పాపులర్ అయ్యాడు.