తెలుగు సినిమాల్లో ప్రస్తుతం సెన్సేషనల్ హీరో ఎవరంటే ఠక్కున చెప్పే పేరు విజయ్ దేవరకొండ. పెళ్లిచూపులు తో హిట్ అందుకున్నా.. అర్జున్ రెడ్డితో విజయ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విజయ్ పేరు సౌత్ లో మోగిపోయింది. తర్వాత వచ్చిన గీత గోవిందంతో స్టార్ హీరో అయిపోయాడు. ఈ ఏడాది విడుదలైన డియర్ కామ్రేడ్ క్రియేట్ చేసిన బజ్ అంతా ఇంతా కాదు.

 


ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై వైభవ్ నిర్మిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను సంక్రాంతి ముందే రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. ప్రస్తుతం టాకీ పార్ట్ కూడా పూర్తైనట్టు సమాచారం. అయితే ఈ సినిమాను 2020 ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే రోజున విడుదల చేయాలని విజయ్ ఆలోచన చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. ఇదే విషయాన్ని నిర్మాతలతో చర్చించినట్టు తెలుస్తోంది. దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక నిర్ణయం తీసుకోనప్పటికీ ఈ సినిమా వచ్చే ఫిబ్రవరిలోనే రిలీజ్ అవుదందని తెలుస్తోంది. విజయ్ ప్రీవియస్ అటెంప్ట్ డియర్ కామ్రేడ్ ఎన్నో అంచనాల మధ్య దక్షిణాది భాషలన్నింటిలో విడుదలైంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సరైన ఫలితాన్నివ్వలేదు. దీంతో ఈ సినిమాపై విజయ్ చాలా కేర్ తీసుకున్నట్టు తెలుస్తోంది.

 


వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో విజయ్ సరసన రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేశ్, కేథరిన్, ఇజబెల్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను కూడా దక్షిణాది భాషల్లో విడుదల చేస్తారని సమాచారం. ఈ సినిమా రిలీజ్ పై వస్తున్న వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మేకర్స్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయాల్సిందే.

 


మరింత సమాచారం తెలుసుకోండి: