సౌత్ లో హీరోయిన్ గా స్టార్ క్రేజ్ తెచ్చుకున్న ఓ హీరోయిన్ సడెన్ గా ఏమైందో ఏమో కాని కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇస్తా అంటుంది. తెలుగు, తమిళ, హింది భాషల్లో సినిమాలు చేసే ఆ హీరోయిన్ కు సడెన్ గా ఈ ఆలోచన ఎలా వచ్చింది.. ఎందుకు వచ్చింది అనేది తెలియదు కాని సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇచ్చే ఆలోచనలో ఉందట.


ఇంతకీ సడెన్ గా సినిమాలకు గ్యాప్ ఇస్తానంటున్న హీరోయిన్ ఎవరు అంటే రకుల్ ప్రీత్ సింగ్ అని తెలుస్తుంది. తెలుగులో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న రకుల్ తమిళ, హింది భాషల్లో కూడా నటిస్తుంది. అయినా సరే అమ్మడికి లక్ కలిసి రావట్లేదు. ఈమధ్య సినిమాలైతే చేస్తున్నా సరైన హిట్లు అందుకోవట్లేదు.


అందుకే ఓ తమిళ ఇంటర్వ్యూలో సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని ఉందన్న విషయాన్ని చెప్పింది రకుల్. సడెన్ గా రకుల్ ఈ డెశిషన్ తీసుకోడానికి కేవలం సినిమాల ఫలితాలే కారణమా లేక మరేదైనా కారణం ఉందా అన్నది చూడాలి. లేటెస్ట్ గా అమ్మడు సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు రాలేదు. అందుకే కొద్దిపాటి బ్రేక్ తీసుకుని సినిమాలు చేయాలని చూస్తుంది.


ఒకవేళ చేసినా సరే తనకు నచ్చిన పాత్రలే చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. ఇన్నాళ్లు అవకాశాలు వస్తున్నాయి కదా అని ఎలాంటి సినిమాలైనా చేశాను.. కాని ఇక మీదట మాత్రం మనసుకి నచ్చిన పాత్రలే చేస్తా.. కంటెంట్ ఉన్న సినిమాలకు తను ప్రాధాన్యత ఇస్తానని చెబుతుంది రకుల్. కేవలం కమర్షియల్ సినిమాలే కాదు లేడీ ఓరియెంటెడ్ సినిమాలను చేయాలని చూస్తుంది రకుల్. మరి రకుల్ నిజంగానే సినిమాలను ఆపేస్తుందా లేదా అన్నది అఫిషియల్ గా తెలియాల్సి ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: