తెలుగు లోవస్తున్న బిగ్ బాస్ 3 మరికొన్ని రోజుల్లో పూర్తి కాబోతుంది.  ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో వరుణ్ సందేశ్, వితిక, బాబా భాస్కర్, శ్రీముఖి, అలీ రెజా,శివజ్యోతి,రాహుల్ ఉన్నారు.  ఈ రోజు ఎవరు ఎలిమినేట్ అవుతారో తేలిపోతుంది. ఇక సోమవారం నుంచి టాస్క్, గేమ్స్ సీరియస్ గా ఉండబోతున్నాయట.  నిన్నటి వరకు  బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి ఇచ్చిన హోటల్ టాస్క్ ఎంతో ఎమోషనల్ గా సాగింది.


ఇంట్లో కుటుంబ సభ్యులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు..ఎమోషన్ కి గురయ్యారు.  ఇక శుక్రవారం నాటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ముందుగా హౌస్ మేట్స్ ని తమ లైఫ్ గ్రాఫ్ ని గీయాలని చెప్పారు. దీంతో ఒక్కో కంటెస్టెంట్ తాము ఎలా ఈ స్థాయికి వచ్చారో వివరించారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి మరో టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా వరుణ్, వితికా.. బాహుబలి, దేవసేనలుగా నటించాలి. శ్రీముఖి.. మహానటిగా, బాబా భాస్కర్.. మాణిక్ భాషాగా, శివజ్యోతి.. చంద్రముఖిగా, రాహుల్.. కాంచనగా, అలీ.. గజినీగా నటించాల్సి ఉంటుంది.

ఇప్పటి వరకు జరగని కామెడీ ఈ టాస్క్ లో అందరూ చూపించారు.  కానీ చివర్లో మాత్రం కాస్త సీరియస్ అయ్యింది.  బాహుబలి, దేవసేన పాత్రలు ధరించిన వరుణ్, వితికా.. 'బాహుబలి' సినిమాలో ప్రభాస్ భుజాల మీద నుండి అనుష్క వెళ్లే సీన్ స్పూఫ్ చేయాలనుకున్నారు.భుజంపై వితికా కాలు పెట్టగానే వరుణ్ బ్యాలన్స్ తప్పడంతో ఇద్దరూ కిందపడ్డారు. ఆ దెబ్బకి వరుణ్ నడుం విరిగింది. ఇకపై ఇలాంటివి చేయనని దండం పెట్టేశాడు. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ మొత్తవ నవ్వులు పూయించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: