రష్మిక హాట్ హాట్ అందగత్తె. అదే టైంలో ఫ్యామిలీ ఆడియన్స్ కి గీత. ఇలా రెండు షేడ్స్ తో మెప్పించగల ఈ ముద్దుగుమ్మకు డిమాండు కూడా అలాగే ఉంది. రష్మిక హీరోయిన్ గా పెట్టుకుంటే చాలు గ్లామర్ కి పెర్ఫార్మెన్స్ కి లోటు లేదని నిర్మాతలు, దర్శకులు ఆలోచించే రేంజికి చేరుకుంది. ఓ విధంగా చెప్పాలంటే రష్మిక ఇపుడు టాప్ లెవెల్ హీరోలతో నటిస్తూ సూపర్ టాప్ ప్లేస్ లో ఉంది.


ఆమె సూపర్ స్టార్ మహేష్ బాబు తో జోడీ కట్టిన సరిలేరు నీకెవ్వరూ మూవీ సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. అదే విధంగా అల్లు అర్జున్ కొత్త  మూవీలో కూడా పెయిర్ గా రష్మికను ఎన్నుకున్నారట. ఇక తెలుగు, తమిళ్ మూవీస్ వరసగా చేస్తూ బిజీగా ఉన్న రష్మిక డైరీ ఎక్కడా ఖాళీ లేదు. కానీ ఆమెతో మూవీస్ తీయాలని నిర్మాతలు పరుగులు పెడుతున్నారు.


అందులో సీనియర్ నిర్మాతలు కూడా ఉన్నారు. దిల్ రాజు రష్మిక, నాగ చైతన్య‌ కాంబోలో ఓ మూవీ చేయాలని అనుకుంటున్నారట.  ఈ క్రేజీ ప్రాజెక్టుకు దర్శకుడు శశి. ఇప్పటికే రష్మికను కలిసి రెండుసార్లు స్క్రిప్ట్ నెరేట్ చేశాడట. ఆమెనుంచి ఔను, కాదు అన్న సమాధానమేమీ లేదట. స్క్రిప్ట్ ఓకె చేస్తే సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని చైతు, దిల్‌రాజు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ విషయంలో రష్మిక ఎటూ తేల్చకపోవడంతో సస్పెన్స్ రన్ అవుతోంది. 


ఇక చైతూ మీడియం రేంజి హీరో. అయితే ఆయన అక్కినేని లెగసీతో వచ్చినవాడు. ఆ ఇమేజ్ ఉంది. మరి స్టార్ హీరోయిన్ స్టాటస్ తో ఉన్న రష్మిక  ఇపుడు ఏ డెసిషన్ తీసుకుంటుందన్నది ఇంటెరెస్టింగ్ చర్చగా ఉంది.  అయితే వరుస సినిమాలతో బిజీగావున్న రష్మిక ఏం రెస్పాన్స్ ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. రష్మిక ఈ మూవీ చేస్తుందా, చేయదా, చైతూకు ఎస్ అంటునందా నో చెబుతుందా ఇదీ ఇపుడు టాలీవుడ్లో హాట్ టాపిక్.


మరింత సమాచారం తెలుసుకోండి: