బిగ్ బాస్ సీజన్ 3లో భార్యా భర్తలను విడగొడుతున్నాడా అంటే అవుననే అంటున్నారు. స్టార్ మా ప్రెస్టిజియస్ గా నిర్వహిస్తున్న బిగ్ బాస్ షో సీజన్ 3లో ఈ వారం ఇంటి సభ్యులంతా నామినేషన్స్ లో ఉన్నారు. ఈ సీజన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉన్న కపుల్స్ వరుణ్ అండ్ వితిక. ఇద్దరు హౌజ్ లో ఎంతో అన్యోన్యంగా ఉన్నారు.


సీజన్ 3లో క్రేజీ కపుల్స్ గా ఉన్న వరుణ్, వితికలు ఇప్పుడు విడిపోయే టైం వచ్చిందని తెలుస్తుంది. హౌజ్ లో ఇన్నాళ్లు సర్ వైవ్ అయిన వితిక ఈ వారం ఎలిమినేట్ అవుతుందని అంటున్నారు. మొదట్లో వరుసగా 3 వారాలు నామినేషన్స్ లోకి వచ్చిన వితిక ఆ తర్వాత మాత్రం వరుణ్ సపోర్ట్ తో నామినేషన్స్ కు దూరంగా ఉంటూ వచ్చింది.


అయితే చివరి దశలో భార్యా భర్తలు విడిపోక తప్పేలా లేదు. హౌజ్ లో ఇప్పటికే నువ్వా నేనా అన్నట్టుగా పోటీ నడుస్తుంది. టాప్ 5 లో ఉండేందుకు ఒక్కొక్కరు ఒక్కోలా తమ ఆట సాగిస్తున్నారు. అయితే బిగ్ బాస్ హౌజ్ లో ఇప్పటి వరకు గట్టి పోటీ ఇచ్చినా సరే వితిక వల్ల వరుణ్ తన ఆటని సరిగా ఆడలేకపోతున్నాడు. అందుకే వితిక నామినేషన్స్ లోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసిన యాంటీ ఫ్యాన్స్ కు ఆమె ఈవారం దొరికేసింది.


ఫైనల్ గా వితిక ఎలిమినేషన్ దాదాపు కన్ఫాం అంటున్నారు. వరుణ్, వితిక జోడీగా వచ్చారు. చివరి వరకు ఉండేందుకు మ్యాక్సిమం ట్రై చేశారు. అయినా మరో రెండు వారాల్లో ఎలాగు షో ముగుస్తుంది. కాబట్టి పెద్దగా ఎడబాటు ఉండే అవకాశం లేదు. వరుణ్, వితిక ది బెస్ట్ కపుల్స్ గా తెలుగు రాష్ట్రాల అందరి మనసులు గెలిచారు. మొత్తానికి వితిక ఎలిమినేషన్ తో ఆట మరింత రసవత్తరంగా మారుతుందని చెప్పొచ్చు.    


మరింత సమాచారం తెలుసుకోండి: