‘చాణక్య’ మూవీ భయంకరమైన ఫ్లాప్ గా మారడంతో గోపీచంద్ మార్కెట్ దాదాపు జీరో అయిపోయింది అన్న వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ పలితంతో విజయదశమి రోజున ప్రారంభం అయిన గోపీచంద్ మూవీ క్యాన్సిల్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ మూవీని నిర్మాత భోగవిల్లి ప్రసాద్ నిర్మించడానికి అన్ని ప్రయత్నాలు పూర్తి చేసిన తరువాత ఇప్పుడు ఈ మూవీ ఆగిపోవడానికి గల కారణం ‘చాణక్య’ ఫ్లాప్ అని అంటున్నారు.

ఈ మూవీ ఫలితంతో ధైర్యం చేసి గోపీచంద్ తో సినిమాను చేసినా మార్కెట్ అవ్వదు అన్న కారణాలతో ఈ మూవీ డ్రాప్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ కావడంతో గోపీచంద్ నటించబోయే మిగతా సినిమాల పై ఉండబోతుంది అని అంటున్నారు. వాస్తవానికి గోపీచంద్ తో సినిమాలు తీయడానికి కొంతమంది మిడిల్ రేంజ్ నిర్మాతలు ఇప్పటికే అడ్వాన్స్ లు గోపీచంద్ కు ఇచ్చిన నేపధ్యంలో ఈ అడ్వాన్స్ ల పరిస్థితి ఏమిటి అంటూ మరికొందరు అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు.

ప్రస్తుతం గోపీచంద్ సంపత్ నంది దర్శకత్వంలో నటిస్తున్న మూవీ మధ్యలో ఉంది. దీనితో ఈ మూవీ పరిస్థితి ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం గోపీచంద్ కు ఈ పరిస్థితి ఏర్పడటానికి గల కారణం అతడి స్వయంకృతం అని మరికొందరు అంటున్నారు. 

ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయినా ఆ విషయాలు పట్టించుకోకుండా రొటీన్ సినిమాలను వరస పెట్టి చేస్తూ ఉండటంతో ఈ పరిస్థితి ఇతడికి ఏర్పడింది అని అంటున్నారు. వాస్తవానికి గోపీచంద్ మళ్ళీ యూటర్న్ తీసుకుని విలన్ పాత్రలో నటించడానికి ఆసక్తి కనపరుస్తున్నా అతడికి ఎవరూ అవకాశాలు ఇవ్వకపోవడం షాకింగ్ గా మారింది. దీనితో ఈ పరిస్థితుల నుండి గోపీచంద్ తేరుకోవాలి అంటే ఏదైనా ఒక అద్భుతం జరగాలి అని అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: