నాగార్జున టాలీవుడ్ మన్మధుడు. అరవైలో కూడా ఇరవై అందాలను చూపించే నవ మన్మధుడు. ఆయన నటించిన మన్మధుడు 2 ఫెయిల్ కావచ్చు కానీ నాగ్ అందం మాత్రం చెక్కుచెదరలేదు. నాగార్జున ఇపుడు మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో వరసగా మూవీస్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఆయన ఇపుడు కొత్త దైరెకర్ తో ఓ మూవీకి సెట్స్ మీదకు తెస్తున్నాడు. అదే వరసలో మరికొన్ని మూవీస్ కూడా ఉన్నాయి.


అయితే నాగ్ పక్కన జోడీ ఎవరు అంటే  ఇంకెవరు రమ్యక్రిష్ణ అంటున్నారట. సోగ్గాడే చిన్ని నాయన మూవీతో ఈ ఇద్దరి జంట బంపర్ హిట్ కొట్టింది. ఆ తరువాత ఇపుడు సోగ్గాడే చిన్న నాయన సీక్వెల్ తీస్తున్నారు. అందులో కూడా నాగ్ తో రమ్య జోడీని కంటిన్యూ చేస్తున్నారట. ఇక నాగ్ బాలీవుడ్లో హిట్ అయిన రైడ్ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. అందులోనూ రమ్యక్రిష్ణ హీరోయిన్ అంటున్నారు.


మరి చూస్తూంటే నాగార్జున సినిమాల్లో హీరోయిన్ గా రమ్య ఫిక్స్ అయిపోయినట్లే కనిపిస్తోంది. ఇపుడు ఈ లేటు వయసులో సీనియర్లకు హీరోయిన్ల కొరత చాలానే ఉంది. దాంతో నాగ్ కి కూడా ఇబ్బంది గా ఉంది. అయితే రమ్య క్రిష్ణతో జోడీ కడితే హిట్ అన్న సెంటిమెంట్ కూడా నాగ్ కి ఉంది.


తొలిసారి ఈ ఇద్దరు సంకీర్తన మూవీని 1987లో చేశారు. ఇప్పటికి 32 ఏళ్ళుగా ఈ జంట వెండితెర పంటగా ఉంది. నాగ్ తో ఎక్కువ సినిమాలు చేయడమే కాడు, సక్సెస్ రేట్ కూడా ఈ ఇద్దరికీ ఉంది. దాంతో నాగ్ తరువాత సినిమాల్లో కూడా రమ్య హీరోయిన్ అంటున్నారు. మరి ఈ జోడీని వెండి తెర మీద హాయిగా చూసేయొచ్చు అన్న మాట.


మరింత సమాచారం తెలుసుకోండి: