వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నటుడు హీరో రామ్ పోతినేని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన “ఇస్మార్ట్ శంకర్” సినిమా చేసి సూపర్ డూపర్ అదిరిపోయే హిట్ అందుకోవడం జరిగింది. పూర్తి మాస్ ఎంటర్టైనర్ రూపంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను రామ్ అభిమానులను ఎంతగానో అలరించింది. రామ్ కెరీర్లోనే ఊహించని విధంగా రికార్డు స్థాయిలో “ఇస్మార్ట్ శంకర్” సినిమాకి ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే గతంలో రామ సినిమా చేయక ముందు పూర్తిగా క్లాస్ సినిమాలు చేస్తూ క్లాస్ గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రామ్ మొట్టమొదటిసారి పూర్తిగా ఫుల్ మాస్ క్యారెక్టర్ కలిగిన “ఇస్మార్ట్ శంకర్” చేసి అభిమానులను తెలుగు సినిమా ప్రేమికులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు.


దీంతో సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో తన తర్వాత సినిమా క్లాస్ సినిమా చేయాలా లేకపోతే మాస్ సినిమా చేయాలా అన్న డైలమాలో రామ్ ఉండిపోవడంతో..రామ్ నెక్స్ట్ తీయబోయే సినిమా పై అటు ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ ఇటు అభిమానుల్లోనూ ఎంతో ఉత్కంఠ నెలకొంది. దీంతో రామ్ ఇటీవల ఓ తమిళ సినిమా రీమేక్ చేయడానికి రెడీ అయినట్లు ఫిలింనగర్ లో వినబడుతున్న టాక్. మొదట ఈ సినిమా చేయకూడదు అని భావించిన చివరాకరికి చేయటానికి రామ్ సిద్ధమైనట్లు ఇండస్ట్రీలో గట్టిగా వార్తలు వినబడుతున్నాయి. ఇక పూర్తిగా విషయంలోకి వెళ్తే గతంలో రాం తో నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, అన్ని సినిమాలు తెరకెక్కించిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ ఈ తమిళ సినిమా చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది.


అంతేకాకుండా ఈ సినిమాలో రామ్ పక్కన హీరోయిన్స్ గా నివేదిత పెతురాజ్‌, మాళ‌విక శ‌ర్మ నటించనున్నట్లు సమాచారం. ఆ సినిమా వివరాల్లోకి వెళితే తమిళంలో తెరకెక్కిన త‌డం అనే సినిమాని రామ్ తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన హక్కులను రామ్ పెద‌నాన్న స్ర‌వంతి ర‌వికిషోర్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. వచ్చే నెల నుండి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి రాబోయే సమ్మర్ కి రిలీజ్ చేయనున్నారట.



మరింత సమాచారం తెలుసుకోండి: