కోలీవుడ్ క్రేజీ హీరో ఇళయ దళపతి విజయ్ నటిస్తున్న కొత్త చిత్రం `విజిల్`. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అటు తమిళంలోనూ.. ఇటు తెలుగులోనూ భారీ అంచనాలు ఉన్నాయి. దీపావళి కానుకగా అక్టోబర్ 25న తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఇప్పటి నుంచే భారీ హంగామా చేస్తున్నారు. విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన తెరి, మెర్సల్‌ సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో విజిల్ పై భారీ అంచనాలు ఉన్నాయి.


కోలీవుడ్‌లో `బిగిల్‌` పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో `విజిల్` పేరుతో రిలీజ్ చేస్తున్నారు.ఇక అదే రోజు మరో కోలీవుడ్ హీరో కార్తి నటిస్తున్న ఖైదీ సినిమా సైతం తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ బిజినెస్ అంచనాలకు మించి జరగటం విశేషం. విజయ్ సినిమాలు తెలుగులో అనుకున్న రేంజ్ లో వసూళ్లు రావటం లేదు.


అయినప్పటికీ విజయ్ నయనతార కాంబినేషన్ కావడంతో విజిల్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో రు.10 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే ఇక్కడ బ్రేక్ ఈవెన్‌ సాధించాలంటే రు. 11 కోట్ల వరకు ఉంటుంది. ఇప్పటివరకు తెలుగులో విజయ్ కు ఈ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం ఇదే తొలిసారి. ఈ సినిమాపై ఉన్న బజ్‌తో పాటు తెలుగు ట్రైలర్ క్రియేట్ చేసిన హడావుడి నేపథ్యంలో విజిల్‌కు మంచి బిజినెస్ జరిగింది.


దీపావళి కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాను తెలుగులో ప్రముఖ టాలీవుడ్ పీఆర్వో మహేష్ కోనేరు ఈస్ట్ కోస్ట్ బ్యానర్‌పై విడుదల చేస్తున్నారు. 400 థియేటర్లలో విజిల్ రిలీజ్ కానుంది. `విజిల్` లో విజయ్ ఫుట్ బాల్ కోచ్ గా నటిస్తుండగా... మూడు విభిన్నమైన గెటప్ లో కనిపించనున్నాడు. మరి విజిల్ బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకుల చేత విజిల్ వేయిస్తుందో ? లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: