అశ్విన్ బాబు , అవికా గోర్  ప్రధాన పాత్రల్లో ప్రముఖ యాంకర్ కమ్ డైరెక్టర్ ఓంకార్  తెరకెక్కించిన  చిత్రం రాజుగారి గది 3.  హర్రర్ కామెడీ  డ్రామా నేపథ్యంలో  తెరకెక్కిన ఈచిత్రం  నిన్న విడుదలై  మిక్సడ్ రివ్యూస్ ను  సొంతం చేసుకుంది.   ఈ సిరీస్ లో వచ్చిన  మెదటి రెండు చిత్రాలు  రాజుగారి గది , రాజు గారి గది 2 ని   డీల్ చేసినట్లుగా  ఓంకార్  ఈ మూడో భాగాన్ని  డీల్ చేయలేకపోయాడు.  సాలిడ్ స్టోరీ లేకపోవడం దానికితోడు  లాజిక్ లేని సన్నివేశాలతో  కేవలం తన  తమ్మడిని  హీరోగా ఎలివేట్ చేసేందుకు మాత్రమే  ఓంకార్  ప్రయత్నించడంతో సినిమా  ఫలితం తేడా కొట్టింది.  అయితే సెకండ్ హాఫ్ లో వచ్చే కామెడీ  ట్రాక్ ఒక్కటే సినిమా కు ప్రధాన బలం. ఆ ఎపిసోడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 



దాంతో సినిమాలో  కామెడీ హిలేరియస్ గా ఉందనే టాక్ బయటికి రావడంతో  మొదటి రోజు ఈ చిత్రం  తెలుగు రాష్ట్రాల్లో  దాదాపు అన్ని ఏరియాల్లో  మంచి  వసూళ్లను రాబట్టుకుందని సమాచారం.  అందులో భాగంగా  సీడెడ్ లో మొదటి రోజు ఈ చిత్రం 24,77,744 షేర్ ను రాబట్టగా  తూర్పు  గోదావరి లో  9,50,376 షేర్ ను   అలాగే పశ్చిమ గోదావరి లో 10,02,698 షేర్ ను  కలెక్ట్ చేసింది.  ఇంకా మిగితా ఏరియాల కలెక్షన్స్  రిపోర్ట్  రావాల్సి వుంది.  ఓవరాల్  గా మొదటి రోజు ఈ చిత్రం  తెలుగు రాష్ట్రాల్లో కోటి కి పైగా షేర్ ను రాబట్టిందని తెలుస్తుంది.  ఈ చిత్రం సేఫ్ కావాలంటే  ఫుల్ రన్ లో మరో  4కోట్ల షేర్ ను రాబట్టాలి.  దీపావళి వరకు బాక్సాఫీస్ వద్ద వేరే సినిమాలతో   పోటీ లేకపోవడం  ఈ చిత్రానికి కలిసి రానుంది.  ఓవర్సీస్ లో ఈ చిత్రాన్ని ఫార్స్ ఫిలిమ్స్ విడుదలచేసింది. ఓంకార్ సొంత ప్రొడక్షన్స్ ఓక్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి  చోటా కె నాయుడు , గౌతమ్ రాజు , సాయి మాధవ్ బుర్ర  వంటి  టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: