తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బిగ్బాస్ తెలుగు సీజన్ 3 షో చివరి అంకానికి చేరుకుంది. అయితే ఎన్నో నామినేషన్లు... మరెన్నో ఎలిమినేషన్... కొన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ లు ఇలా బిగ్ బాస్ తెలుగు సీసన్ 3 షో  టెలివిజన్ ప్రేక్షకులందరినీ అలరించింది . ఇక బిగ్ బాస్ హౌస్ లో సెలబ్రేటీలు  చేసే రచ్చ కాంట్రవర్సీ గొడవలు... కుళ్ళు జోకులు.. బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లు... ఆ తర్వాత నామినేషన్లు ఇలా బిగ్ బాస్ షో భలే రంజుగా ఉంటుంది. ఇప్పటికే 12 వారాల ను పూర్తిచేసుకుంది బిగ్ బాస్ షో. కాగా ఇంకో రెండు వారాల్లో బిగ్ బాస్ షో ముగియనుంది. 

 

 

 

 కాగా 17 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ఈ షో ప్రస్తుతం బాబా భాస్కర్,  శ్రీముఖి, వరుణ్ సందేశ్,  రాహుల్  సిప్లిగంజ్,  శివ జ్యోతి,వితిక  ఇలా చివరికి ఏడుగురు కంటెస్టెంట్ లు బిగ్ బాస్  తెలుగు సీజన్ 3 హౌస్ లో ఉన్నారు. అయితే మరో రెండు వారాలు బిగ్ బాస్ షో ముగియనుండడంతో బిగ్ బాస్ విన్నర్ కి స్టార్ మా ఇచ్చే 50 లక్షల ప్రైజ్మనీ ఎవరు అందుకుంటారు అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. కాగా ఈ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారనే  దానిపై కూడా ప్రేక్షకులకు ఆసక్తి నెలకొంది. ఈ వీక్ లో బయటికి వెళ్లడానికి శివజ్యోతి, వితిక,  బాబా భాస్కర్ కానీ బయటకు వెళ్లే ఛాన్స్ ఉందని ప్రేక్షకులు భావిస్తారు. 

 

 

 

 వీళ్ళ ముగ్గుల్లో ఎక్కువగా వితిక  పేరు వినిపిస్తుంది. ఎందుకంటే గత వారం తన ప్రవర్తన కారణంగా కాస్త నెగటివిటీ  మూటగట్టుకుంది వితిక. కాగా ఈ వారం వితికానే హౌస్ నుండి బయటకు వెళ్లి పోతుంది అని అందరూ భావిస్తున్నారు. బిగ్ బాస్ ఓటింగ్ చూసినా కూడా అదే అర్థమవుతుంది. అయితే పన్నెండు వారాల పాటు ఎన్నోసార్లు నామినేషన్లలో  ఉన్న వితిక... ఇప్పటి వరకు ఎలిమినేషన్ నుంచి సేవ్ అవుతూ వచ్చింది. కానీ ఈవారం మాత్రం బిగ్ బాస్ 3 హౌస్ నుంచి  బయటకు వెళ్లి పోతుంది అని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: