అమితాబ్ బచ్చన్ కాలేయ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారని, ఆ కారణంగానే ముంబై లోని నానావతి ఆసుపత్రిలో చేరినట్లు ప్రముఖ మీడియా సంస్థలు కథనాలు వెలువరిస్తున్నాయి. అక్టోబర్ 15వ తేదీ అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆయన హాస్పిటల్‌లో చేరినట్లుగా తెలుస్తోంది.అమితాబ్ ఫుల్ బాడీ చెకప్ కోసం ఆసుపత్రికి వచ్చారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లుగా నానావతి ఆసుపత్రి వైద్యులు చెప్పారని తెలిసింది. ఇప్పటికి మూడు రోజులు, దీనితో ఆయన అభిమానులు,కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
ప్రస్తుతం ఐతే అమితాబ్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని చెప్పారు.                    


అమితాబ్ ఫుల్ బాడీ చెకప్ కోసం ఆసుపత్రికి వచ్చారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లుగా నానావతి ఆసుపత్రి వైద్యులు చెప్పారని తెలిసింది. ఈ మేరకు అమితాబ్‌ను విశ్రాంతి అవసరమని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నట్లుగా మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వెలువడుతున్నాయి. ఈ విషయం తెలిసి అమితాబ్ అభిమాన వర్గాలు ఆయన ఆరోగ్యం బాగుండాలని సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు.


ఇటీవలే 77వ పుట్టినరోజు వేడుక జరుపుకున్న అమితాబ్ సడన్ గా ఆస్పత్రిపాలు కావడం కొంచెం బాధకలిగిస్తుంది. అమితాబ్ ప్రస్తుతం 'కౌన్ బనేగా కరోడ్ పతి' అనే కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే ఆయన తాజా సినిమాలు 'గులాబో సితాబో, జుంద్, చెహ్రీ, బ్రహ్మాస్త్ర చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక ఇటీవలే సైరా నరసింహా రెడ్డి సినిమాతో టాలీవుడ్ తెరపై కూడా ఆయన కాలుమోపిన సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: