ఆది సాయికుమార్ కథానాయకుడిగా, ప్రముఖ రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' (ఒ.జి.యఫ్). ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ .బిహెచ్, సతీష్ డేగల, ఆర్టిస్ట్స్ మరియు టెక్నీషియన్స్ నిర్మాత‌లు. 'ఎయిర్ టెల్' మోడ‌ల్ శ‌షా చెట్రి, కార్తీక్ రాజు, పార్వ‌తీశం, నిత్యా న‌రేశ్, కృష్ణుడు, అనీశ్ కురువిల్లా, రావు ర‌మేశ్‌ ఈ చిత్రంలో ప్రధాన తారాగణం. ఈ నెల 18న సినిమా విడుదలై విజ‌యం సాధించిన సంద‌ర్భంగా ప్ర‌సాద్‌ల్యాబ్స్‌లో స‌క్సెస్‌మీట్‌ను నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశంలో...


డైరెక్ట‌ర్‌ మాట్లాడుతూ... ఈ సినిమా ఇంత బాగా రావ‌డానికి  ప్ర‌ధాన కార‌ణం అంద‌రూ నాకు బాగా స‌పోర్ట్ చేశారు. ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు కూడా ఈ సినిమాకి గ్రేట్ స‌పోర్ట్ ఇచ్చారు. హార్డ్ వ‌ర్క్ తోనే ఇది కంప్లీట్ అయింది. థ్యాంక్స్ టు ఎవ‌ర్‌గ్రీన్‌. 


ప‌ద్మ‌నాభ‌రెడ్డి మాట్లాడుతూ... ఈ సినిమా స్టార్ట్ చేసిన‌ప్ప‌టి నుంచి ప్రొడ్యూస‌ర్స్, ఆర్టిస్టులు చాలా హెల్ప్ చేశారు. రిలీజ్‌కి ముందు కొంచం క‌ష్టంలో ఉన్న‌ప్పుడు నేను టేక‌ప్ చేశాను. ఈ సినిమా పేట్రియాటిక్ మూవీ కావ‌డంతో ఒక ఇండియ‌న్‌గా నేను చాలా త్వ‌ర‌గా స్పందించాను. ఈ మూవీ చాలా ఎమోష‌న‌ల్‌కి గుర‌వుతారు. మ‌నంద‌రం ఈ సినిమాని నిల‌బెట్ట‌డం. పేట్రియాటిక్ ఫిల్మ్‌ని త‌ప్ప‌కుండా అంద‌రూ నిల‌బెట్టాల‌ని కోరుకుంటున్నాను. ఈ సినిమా ఇంకా రీచ్ కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.
హీరో ఆది మాట్లాడుతూ.. నిన్న రిలీజ్ అయింది. చాలా మంచి అప్లాజ్ వ‌చ్చింది నా పాత్ర బావుంద‌న్నారు. నేను చాలా హ్యాపీ. సినిమాకూడా ఇదొక ఎటెంప్ట్ అనే చెప్పాలి. ఈ సినిమా తీసేట‌ప్పుడు నేను చాలా గ‌ర్వంగా ఫీల‌యి చేశాను. చూసిన‌వాళ్ళంద‌రూ యునామిన‌స్‌గా మూవీ బావుంద‌న్నారు. క‌లెక్ష‌న్స్ అన్నీ అన్ని చోట్లా చాలా బావుంది. 


హీరో కార్తిక్ మాట్లాడుతూ... ఈ రోజుల్లో సినిమా తియ్య‌డం ఒక ఎత్తు, దాన్ని రిలీజ్ చెయ్య‌డం ఒక ఎత్తు. నేను సినిమా చూశాక అంద‌రి క్యారెక్ట‌ర్లు బావుంది. రివ్వ్యూ ఒక ఒన్ వీక్ ఆగి రాయండి. సినిమాని బ్ర‌తికించండి. చాల మంచి సినిమా తీశాం. అంద‌రూ స‌పోర్ట్ చెయ్యండి. మంచి సినిమాల‌ను ద‌య‌చేసి స‌పోర్ట్ చెయ్యండి.


అబ్బూరు ర‌వి మాట్లాడుతూ... నిన్న రిలీజ్ అయిన మా సినిమా . ఈ సినిమాని బ‌య‌ట‌కి తీసుకురావ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డ్డారు. తియ్య‌డానికి సాయిగారు ఎంత క‌ష్ట‌ప‌డ్డారో తీసుకురావ‌డానికి ప‌ద్మ‌నాభ‌రెడ్డిగారు అంత క‌ష్ట‌ప‌డ్డారు. ఒక పాట‌, డ్యాన్స్‌, లేకుండా చెయ్య‌డం ఆ పాత్ర‌ని ఒప్పుకోవ‌డానికి ఆది చాలా గ్రేట్‌. చాలా మంచి క‌థ ఆయ‌న చ‌య్య‌డం గ్రేట్‌. సినిమాని ప్రేమిస్తూ ఎక్క‌డో ఫైనాన్షియ‌ల్ క‌ష్టాలు నాకు బాగా తెలుసు సినిమా మీద ఉన‌న ప్రేమ‌తో ఇంత మంది క‌లిసొస్తారు.  అంద‌రూ క‌లిసి వ‌చ్చి ఇవ్వడం అనేది క‌థ బావుండ‌డ‌మే మెయిన్‌. ఈ సినిమా కాశ్మీరి ఇష్టూ ఉంది. అంగుళం వ‌ద‌లం అండ‌గా నిల‌బ‌డ‌తాం అన్న డైలాగ్ సూప‌ర్బ్. నేను ఈ సినిమా ఒక ఘాజీబాబా క్యారెక్ట‌ర్ చెయ్య‌డం చాలా ఆనందంగా ఉంది. నాకే విచిత్రంగా ఉంది. రివ్వ్యూలు రాయాలి. స‌గంలో ఆగిపోకూడ‌దు. ప్రేక్ష‌కుల‌కు చాలా పెద్ద థ్యాంక్స్ థియేట‌ర్‌కి వ‌చ్చి సినిమా చూసి ప్ర‌తి ఒక్క‌రికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు.


మరింత సమాచారం తెలుసుకోండి: