కేంద్ర ప్రభుత్వం ఏటా బహూకరించే ప్రతిష్ఠాత్మకమైన ఉత్తమ నటుడి పురస్కారాన్ని కమల్ హసన్ మూడు పర్యాయాలు గెలుచుకున్నాడు. ఆ చిత్రాలు వరుసగా: మూండ్రంపిరై,  నాయకన్ (నాయకుడు) మరియు ఇండియన్ (భారతీయుడు). ఈయన ఉత్తమ బాలనటుడిగా కూడా కేంద్ర ప్రభుత్వ పురస్కారాన్ని కలతూర్ కన్నమ్మ చిత్రానికిగానూ గెలుచుకున్నాడు. ఇవే కాకుండా సాగర సంగమం, స్వాతి ముత్యం చిత్రాలకు వరుసగా 1983, 1985 లలో ఆసియా చిత్రోత్సవాల్లో ఉత్తమ నటుడి బహుమతి పొందాడు. మరో ప్రతిష్ఠాత్మక ఫిల్మ్ ఫేర్ బహుమతిని ఆయన రికార్డు స్థాయిలో 18 సార్లు సొంతం చేసుకున్నాడు. ఆయన నటించిన ఆరు చిత్రాలు భారతదేశం తరపున అధికారికంగా ఆస్కార్ బహుమతికై పంపబడ్డాయి. భారత ఉపఖండంలో మరే నటుడు/నటికీ ఈ గౌరవం దక్కలేదు. 1990లో కేంద్ర ప్రభుత్వం కమల్ హసన్ ను పద్మశ్రీ బిరుదంతో గౌరవించింది. 2005లో మద్రాసు లోని సత్యభామ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేటు ప్రదానం చేసింది. 2014లో కేంద్రప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.


మూడు దశాబ్దాలకు పైబడిన నట జీవితంలో కమల్ హసన్ మొత్తం 171 అవార్డులను సొంతం చేసుకున్నాడు. తమిళ సినిమాకు చేసిన సేవలకుగాను తమిళనాడు ప్రభుత్వం ఆయన్ను కలైమామణి (కళాకారుల్లో మాణిక్యం) బిరుదంతో సత్కరించింది.


కాగా కమలహాసన్‌ నటుడిగా 60 ఏళ్లను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన్ని శివాజీ గణేశన్‌ కుటుంబ సభ్యులు నటుడు ప్రభు, రామ్‌కుమార్‌ తదితరులు శుక్రవారం స్థానిక బోగి రోడ్డులోని శివాజీ ఇంటికి ఆహ్వానించి విందునిచ్చారు.


భారత చిత్రరంగంలో ఎంతో ఎదిగినా ఒదిగివుండే వినమ్రత శివాజీ గణేశన్ లో కనిపిస్తుంది. పాతతరం నటుల నుండి ఈతరం కథానాయకుల వరకు అందరూ శివాజీతో నటించినవారే మరియు ఈతని నీడలో సేదతీరినవారే.అలానే దివంగత నటుడు, నడిగర్‌ తిలగం శివాజీ గణేశన్‌కు నటుడు కమలహాసన్‌ అంటే చాలా ఇష్టం. కమలహాసన్‌ కూడా ఆయన్ని అప్పా(నాన్న) అని ప్రేమాభిమానంతో సంబో ధించేవారు.కాగా కమలహాసన్‌ నటుడిగా 60 ఏళ్లను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన్ని శివాజీ గణేశన్‌ కుటుంబ సభ్యులు నటుడు ప్రభు, రామ్‌కుమార్‌ తదితరులు శుక్రవారం స్థానిక బోగి రోడ్డులోని శివాజీ ఇంటికి ఆహ్వానించి విందునిచ్చారు.

ఇక శివాజీ గణేశన్‌ లేకపోయినా ఇప్పటికీ, ఆయన కుటుంబం కమలహాసన్‌ను తమలో ఒకరిగా భావిస్తారు. ఈ సందర్భంగా ఆయన ఆ ఫొటోలను తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఎప్పటిలానే అన్నై ఇల్లత్తిల్‌ (శివాజీగణేశన్‌ ఇల్లు)లో ఎప్పటిలాగే పసందైన విందును ప్రేమాభిమానాలను కలిపి ఇచ్చారు. ఆయనతో పాటు ఆయన కుమార్తె శ్రుతిహాసన్‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా  శివాజీ గణేశన్‌ కుటుంబ సభ్యులు రామ్‌కుమార్, ప్రభు కమలహాసన్‌కు జ్ఞాపికను అందించారు.జ్ఞాపికను అందుకున్న నటుడు కమలహాసన్‌ అందులో ప్రశంసలకు కంటతడి పెట్టారు.తమ్ముడు ప్రభు తన గురించి జ్ఞాపికలో రాసిన ప్రశంసలు తనను కంటతడి పెట్టించాయి అని పేర్కొన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: