దసరా తర్వాత దీపావళికి తెలుగులో రిలీజ్ అయ్యే పెద్ద సినిమాలేం లేవు. దసరా సందడంతా "సైరా" తోనే ముగిసింది. ఇక సంక్రాంతి వరకు థియేటర్ల దగ్గర పెద్దగా సందడి కనిపించదు. సంక్రాంతికి రెండు నుండి మూడు పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద చిన్న సినిమాలు విడుదల అవుతున్నాయి. అయితే దీపావళికి తెలుగు సినిమాల సందడి లేకపోయినా డబ్బింగ్ చిత్రాల హవా కొనసాగేలా ఉంది.


తలపతి విజయ్ నటించిన" బిగిల్" చిత్రం మరికొద్ది రోజుల్లో విడుదలకు సిద్ధం అవుతుంది. తెలుగులో "విజిల్" పేరుతో అనువాదం అయింది. అయితే ఈ సినిమా టీజర్ విడుదల అయినప్పటి నుండి అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. మొన్న విడుదలైన ట్రైలర్ కి విశేష స్పందన లభించింది. అతి తక్కువ రోజుల్లోనే మిలియన్ల వ్యూస్ ని దాటేసింది. అంతే కాదు రెండు మిలియన్ల కంటే ఎక్కువ లైక్స్ వచ్చిన రెండవ స్థానంలో నిలిచింది. 


ఇది అట్లీ- విజయ్ కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం కాబట్టి ఈ  సినిమాపై అంచానాలు భారీగా ఉన్నాయి. వీరిద్దరి కాంబినేషన్ లో వఛ్చిన  తెరి, మెర్సల్ చిత్రాలు బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు సాధించాయి.  ఈ మూడో చిత్రం కూడా రికార్డులు క్రియేట్ చేస్తోంది ఆశిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బాగానే జరిగింది.మూవీపై ఉన్న హైప్ రీత్యా బిగిల్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా దుమ్మురేపింది.


ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ 140కోట్ల వరకు ప్రీరిలీజ్ బిసినెస్ జరిపిందని సమాచారం. ఈ మూవీ బడ్జెట్ కూడా 180కోట్ల వరకు ఐయ్యిందని తెలుస్తుంది. ఇంకా తెలుగులో కూడా ఈ చిత్ర హక్కుల కొరకు 9-10 కోట్ల వరకు వెచ్చించారని వినికిడి.విజయ్ గత చిత్రాలతో పోల్చుకుంటే ఇది భారీ రేటుగా చెప్పవచ్చు. మరి తెలుగులో ఈ సినిమా సూపర్ హిట్ సాధిస్తుందో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: