ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ 3 తెలుగు షో ఒక ఎత్తు ఐతే నిన్న జరిగిన ఒక్క ఎపిసోడ్ మాత్రం ఒక ఎత్తు. నిన్న జరిగిన ఒక్క టాస్క్ సోషల్ మీడియాలో పెద్ద యుద్దానికి తెరలేపింది. డే ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అంటూ అందరికీ ఒక్కో పాత్రను ఇచ్చి ఆ పాత్రలలో  జీవించమన్నాడు. దీనితో గజినీ పాత్రలో అలీ, కాంచన రోల్ లో రాహుల్, బాషా పాత్రలో బాబా ఇలా అందరికీ ఒక్కోక  ప్రత్యేక పాత్రను ఇచ్చాడు బిగ్ బాస్.


క్యారెక్టర్ ఇచ్చిన మరుక్షణంలోనే బాబా భాస్కర్ బాషా, మాణిక్యం పాత్రల్లో జీవించాడు. స్టోర్ రూమ్ వద్దకు వెళ్లి ఏకంగా బిగ్‌బాస్‌ నే బెదిరించాడు. "డోర్ మీరు తీస్తారా? నన్ను తీయమంటారా?" నాకు ఇంకో పేరు ఉంది. బాషా.. ఈ బాషా ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్లే అంటూ బిగ్‌బాస్‌తో జోకులు వేస్తూ పాత్రలో ఒదిగి పోయాడు. ఇలా నిన్నటి ఎపిసోడ్ మొత్తం బాబా బిజీబిజీగా నడిపించాడు. గజినీని ఆటో ఎక్కించడం, సావిత్రిగా ఉన్న శ్రీముఖిని నగ్మా అంటూ పిలవడం, కాంచనను బెదిరించడం ఇలా ప్రతీ చోట రజినీని దించేశాడు బాబా . ఇంతటితో బాబా భాస్కర్‌పై బయట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.


బిగ్‌బాస్ హౌస్‌ల్ టాస్క్‌ ల పరంగా ఇంత వరకు తనను తాను ప్రూవ్ ఎక్కవుగా చేసుకోలేకపోయాడు రాహుల్. అయితే పాటలు పాడుకుంటూ, మనసులో ఏం పెట్టుకోకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే తత్త్వంతో రాహుల్‌కు క్రేజ్ బాగా పెరుగుతూ వచ్చింది. నిన్న జరిగిన ఎపిసోడ్‌లో కాంచనగా చేసిన పాత్రలో రెచ్చిపోయి స్టెప్పులేయడంతో రాహుల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తమ చిచ్చా పవరేంటో ఇప్పటికైనా తెలిసిందా? అంటూ ట్వీట్లు వేస్తున్నారు రాహుల్ ఫాన్స్. టాస్క్‌లు చేయలేడు అనేవారికి చెంపపెట్టులాంటి పర్ఫామెన్స్ ఇచ్చాడని రాహుల్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.


ఇది అంతా ఇలా ఉంటే బాబా భాస్కర్‌కు ఓటు వేయాలని విజయ్ ఫ్యాన్స్‌ ను సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసాడు బాబా భాస్కర్ అభిమాని. దీంతో అసలు రచ్చ మొదలైంది. తమిళ నాడు ప్రజలను ఓట్లు అడుక్కుంటున్న బాబా భాస్కర్ ఫాన్స్ అని కొందరు ట్వీట్లు చేయగా అలాంటి చీప్ ట్రిక్స్ రాహుల్ ఫాలోవర్స్‌ కే తెలుస్తాయంటూ ఇంకొంత మంది ట్వీట్ చేసుకుంటూ సోషల్ మీడియా లో పెద్ద యుద్ధమే జరుగుతోంది ప్రస్తుతం. ఆ ట్వీట్ బాబా ఫ్యాన్స్ చేయలేదని రాహుల్ ఫ్యాన్సే కావాలని ట్వీట్ చేశారని ఆరోపిస్తున్నారు కొందరు. ఇలా ఈ ఇద్దరి ఫ్యాన్స్ మధ్య గట్టి వార్ జరుగుతోంది ఇప్పుడు సోషల్ మీడియాలో.


బిగ్‌బాస్ మొదలైనప్పటి నుంచి ఎంటర్టైన్మెంట్ అంటూ ఇచ్చేది ఎవరైనా ఉన్నారంటేకేర్ అఫ్ అడ్రస్ బాబా భాస్కర్ ఒక్కరేనని సోషల్ మీడియాలో కామెంట్లు బాగా వినిపిస్తున్నాయి. బాబా లేకుండా షోలో వినోదమే ఉండదని అంటున్నారు. నిన్నటి ఎపిసోడ్‌ లో బాబానే అందరి హృదయాలను గెలుచుకున్నాడని కామెంట్లు చేస్తున్నారు. రజినీ మ్యానరిజంతో ఎపిసోడ్ మొత్తాన్ని నడిపించేశాడని బాబా ఫాలోవర్స్ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టి తెగ షేర్ చేసేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: