తమిళ్ స్టార్ హీరో సూర్య, మాస్ డైరెక్టర్ శివ కాంబినేషన్ లో సినిమా  రాబోతున్న సంగతి తెలిసిందే. సూర్య 39వ ప్రాజెక్ట్ గా వస్తోన్న ఈ సినిమాలో స్టార్ హీరొయిన్ నయనతార  హీరోయిన్ గా నటిస్తోన్నట్లు తెలుస్తోంది. అలాగే  మరో రోల్ లో  కాజల్ అగర్వాల్ కూడా కనిపిస్తోందట. కాకపోతే కాజల్ పాత్ర నిడివి చాల తక్కువని సమాచారం.   ఇక  ప్రముఖ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ డి ఇమ్మాన్ సూర్య 39వ సినిమాకి సంగీతం సమకూర్చనున్నారు. ఇమ్మాన్ సూర్య సినిమాకి పనిచేయడం ఇదే మొదటిసారి. అలాగే ఈ చిత్రం కోసం కెమెరామెన్ గా ప్రముఖ కెమెరామెన్ వెట్రీ పని చేస్తున్నారు.  ఏమైనా  సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్స్ చాల మందే ఉన్నారు. కానీ ప్రతి సినిమాలో  కొత్తగా ట్రై చేస్తూ.. వైవిధ్యమైన నటనతో  ప్రేక్షకులకు  డిఫరెంట్ చిత్రాలను అందిస్తూ.. ప్రతి సినిమాను ఓ ఛాలెంజింగ్ గా తీసుకుని చేసే స్టార్ హీరోల్లో..   సూర్య పేరు ముందు వరుసలో ఉంటుంది.  అందుకే సూర్య ఖాతాలో  'సింగం' వంటి యాక్షన్ ఎంటర్ టైనర్ లు.. 'గజినీ', 'సెవెన్త్ సెన్స్' వంటి ఓ కొత్తరకం సినిమాలు... 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' వంటి డిఫరెంట్ లవ్ స్టోరీలు  ఉన్నాయి.

 ఇక  గోపీచంద్ తో 'శౌర్యం' సినిమాతో  డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు శివ. ఆ తరువాత  తమిళ స్టార్ అజిత్ తో వరుసగా సినిమాలు తీసి  బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందుకున్నాడు.  కాగా సూర్య - డైరెక్టర్ శివ కాంబినేషన్ లో వచ్చే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందేమో చూడాలి.  నిజానికి ఆ మధ్య ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి.  శివ ప్రస్తుతం రజినీకాంత్ తో మూవీ ప్లాన్ చేస్తోన్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక సూర్యతో సినిమా ఉంటుంది. ఎట్టకేలకు శివ -  సూర్య  కాంబినేషన్ లోనే సినిమా రానుంది.  ఇక ఈ సినిమా కూడా శివ గత సినిమాల శైలిలోనే పక్కా మాస్ అంశాలతో మంచి ఎమోషనల్ గా సాగుతుందట. ముఖ్యంగా సూర్య  క్యారెక్టర్ చాలా బాగుంటుందట.  అయితే ఈ మధ్య సూర్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుస డిజాస్టర్ లుగా నిలుస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో సూర్య నటిస్తున్న ఈ సినిమాతోనైనా సూర్య  మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.


తమిళ్ స్టార్ హీరో  సూర్య, మాస్ డైరెక్టర్ శివ కాంబినేషన్ లో సినిమా  రాబోతున్న సంగతి తెలిసిందే. సూర్య 39వ ప్రాజెక్ట్ గా వస్తోన్న ఈ సినిమాలో స్టార్ హీరొయిన్ నయనతార  హీరోయిన్ గా నటిస్తోన్నట్లు తెలుస్తోంది. అలాగే  మరో రోల్ లో  కాజల్ అగర్వాల్ కూడా కనిపిస్తోందట. కాకపోతే కాజల్ పాత్ర నిడివి చాల తక్కువని సమాచారం.   ఇక  ప్రముఖ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ డి ఇమ్మాన్ సూర్య 39వ సినిమాకి సంగీతం సమకూర్చనున్నారు. ఇమ్మాన్ సూర్య సినిమాకి పనిచేయడం ఇదే మొదటిసారి. అలాగే ఈ చిత్రం కోసం కెమెరామెన్ గా ప్రముఖ కెమెరామెన్ వెట్రీ పని చేస్తున్నారు.  ఏమైనా  సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్స్ చాల మందే ఉన్నారు. కానీ ప్రతి సినిమాలో  కొత్తగా ట్రై చేస్తూ.. వైవిధ్యమైన నటనతో  ప్రేక్షకులకు  డిఫరెంట్ చిత్రాలను అందిస్తూ.. ప్రతి సినిమాను ఓ ఛాలెంజింగ్ గా తీసుకుని చేసే స్టార్ హీరోల్లో..   సూర్య పేరు ముందు వరుసలో ఉంటుంది.  అందుకే సూర్య ఖాతాలో  'సింగం' వంటి యాక్షన్ ఎంటర్ టైనర్ లు.. 'గజినీ', 'సెవెన్త్ సెన్స్' వంటి ఓ కొత్తరకం సినిమాలు... 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' వంటి డిఫరెంట్ లవ్ స్టోరీలు  ఉన్నాయి.


 ఇక  గోపీచంద్ తో 'శౌర్యం' సినిమాతో  డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు శివ. ఆ తరువాత  తమిళ స్టార్ అజిత్ తో వరుసగా సినిమాలు తీసి  బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందుకున్నాడు.  కాగా సూర్య - డైరెక్టర్ శివ కాంబినేషన్ లో వచ్చే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందేమో చూడాలి.  నిజానికి ఆ మధ్య ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి.  శివ ప్రస్తుతం రజినీకాంత్ తో మూవీ ప్లాన్ చేస్తోన్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక సూర్యతో సినిమా ఉంటుంది. ఎట్టకేలకు శివ -  సూర్య  కాంబినేషన్ లోనే సినిమా రానుంది.  ఇక ఈ సినిమా కూడా శివ గత సినిమాల శైలిలోనే పక్కా మాస్ అంశాలతో మంచి ఎమోషనల్ గా సాగుతుందట. ముఖ్యంగా సూర్య  క్యారెక్టర్ చాలా బాగుంటుందట.  అయితే ఈ మధ్య సూర్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుస డిజాస్టర్ లుగా నిలుస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో సూర్య నటిస్తున్న ఈ సినిమాతోనైనా సూర్య  మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.   తమిళ్ స్టార్ హీరో

మరింత సమాచారం తెలుసుకోండి: