తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్ళిన రాజమౌళి ‘బాహుబలి’ కి అనేక రికార్డులు అవార్డులు ఇప్పటికే వచ్చాయి. ఈ సినిమా విడుదలై సంవత్సరాలు గడిచిపోతున్నా ఇంకా ఈ మూవీకి గుర్తిపు కొనసాగుతూనే ఉంది. 

దీనికి కొనసాగింపుగా లండన్ ఆల్బర్ట్ హాల్ లో జరుగుతున్న ఉత్సవాలలో ‘బాహుబలి’ కి స్థానం దక్కిన సందర్భంగా రాజమౌళి ప్రభాస్ రానా అనుష్క కీరవాణిలతో ఈ ఈవెంట్ లో సందడి చేస్తున్నాడు. అయితే ఈ ఈవెంట్ కు రాజమౌళి తెలుగుదనం ఉట్టిపడే పంచ కట్టుతో కండువా వేసుకుని లండన్ ఆల్బర్ట్ హాల్ కు రావడంతో లండన్ మీడియా దృష్టి అంతా రాజమౌళి పంచకట్టు పైనే పడినట్లు వార్తలు వస్తున్నాయి.

అంతేకాదు రాజమౌళి తెలుగువారి సాంప్రదాయ పంచకట్టును హైలెట్ చేస్తూ లండన్ లోని ప్రముఖ ఇంగ్లీష్ పత్రికలు రాజమౌళి పంచకట్టు ఫోటోలను ప్రముఖంగా ప్రచురించాయి. అదేవిధంగా భారతీయ సంస్కృతి గురించి తెలుగు వారి వస్త్ర ధారణ గురించి లండన్ మీడియా ప్రత్యేకంగా వార్తలను వ్రాసింది. 

గతంలో ఎన్టీఆర్ ఎఎన్ఆర్ లు ప్రపంచంలోని ఏ దేశానికి వెళ్ళినా తెలుగు సాంప్రదాయం ఉట్టిపడే నిండైన పంచ కట్టుతో కనిపించేవారు. అయితే వారిద్దరూ కొనసాగించిన తెలుగు వాళ్ళ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు రాజమౌళి ఇలా సాంప్రదాయంగా కనిపించడంతో ప్రపంచంలోని తెలుగు వారందరూ ‘సాహో రాజమౌళి’ అని అంటున్నారు. అయితే రాజమౌళి ఇంత సాంప్రదాయంగా కనిపిస్తే ఇదే ఈ ఈవెంట్ కు వచ్చిన ప్రభాస్ రానా కీరవాణిలు మాత్రం మన సాంప్రదాయాన్ని అనుసరించకుండా వెస్ట్రన్ సాంప్రదాయానికి సంబంధించిన డ్రస్సులలో ఈ ఈవెంట్ లో సందడి చేయడం ప్రత్యేకత. ఈరోజు లండన్ మీడియాతో రాజమౌళి ‘బాహుబలి’ గురించి తెలుగు సినిమా గురించి ప్రత్యేకంగా ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాదబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: