సంక్రాంతి పెద్ద పండుగా. ఆ సీజన్ టాలీవుడ్ కి కలసివచ్చే సీజన్. ఇది స్వర్ణయుగం కాలం నాటి నుంచి ఉన్న సెంటిమెంట్. టాలీవుడ్లో సంక్రాంతికి బొమ్మ పడితే హిట్ అన్నది ఈ మధ్య కాలం వరకూ ఉన్న అభిప్రాయం. ఎన్ని సినిమాలు వచ్చినా కూడా లాభాలను కళ్ళ చూస్తారన్నది కూడా అందరికీ తెలిసిన విషయమే. దీని మీద దర్శకరత్న దాసరి నారాయణరావు సైతం ఒకే మాట అనేవారు. సంక్రాంతికి ఎన్ని మూవీస్ నైనా భరించే కెపాసిటీ ఉందని.


అయితే కొన్నేళ్ళుగా అలా జరగడంలేదు. సంక్రాంతికి వచ్చిన అన్ని సినిమాలు చూడాలని ఆడియన్స్ అనుకోకపోవడమే అందుకు కారణం. ఉన్న వాటిలో మంచి మూవీనే సెలెక్ట్ చేసుకుని దానికి కలెక్షన్లను కుమ్మేస్తున్నారు. దాంతో మిగిలిన సినిమాలు బావురుమంటున్నారు. ఈ ఏడాది విషయానికే వస్తే బాలయ్య కధానాయకుడు మూవీ మరీ బాడ్ ఏమీ కాదు. అయితే సంక్రాంతి సీజన్ కి కాస్తా ముందు వచ్చి డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. చివరికి డిజాస్టర్ అయింది.


ఇక సంక్రాంతికి వచ్చిన మిగిలిన సినిమాలు రెగ్యులర్ ఫార్మేట్లో  ఉండడంతో వాటిని జనాలు ఆదరించారు. ముఖ్యంగా ఎఫ్ 2 మూవీని అయితే నెత్తికెత్తుకుని భారీ వసూళ్ళు వచ్చేలా చేశారు. అలాగే పేట మూవీకి కూడా బాగానే గిట్టుబాటు అయింది. ఈ నేపధ్యంలో ఆడియన్స్ మూడ్ మారుతోందనిపిస్తోంది. సంక్రాంతి వస్తే  మరీ సినిమా హాళ్ళ వైపే జనాల  అడుగులు పడడంలేదని కూడా అర్ధమవుతోంది.


ఈ నేపధ్యంలో ఈసారి అంటే 2020 సంక్రాంతికి పెద్ద సినిమాలు రెండు ఢీ కొడుతున్నాయి. అవి మహేష్ సరిలేరు నీకెవ్వరూ, మరోటి అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో మూవీ. ఈ రెండింటితో పాటు వెంకటేష్ చైతూల వెంకీ మామ కూడా వచ్చేలా కనిపిస్తోంది. ఇక గత ఏడాది పేటతో ముందుకువచ్చి రజనీకాంత్ ఈ ఏడాది దర్బార్ తో రెడీ అవుతున్నాడు. చూడాలి మరి ఈ నాలుగింటిలో అసలైన సంక్రాంతి విజేత ఎవరు అవుతారో.


మరింత సమాచారం తెలుసుకోండి: