రాజకీయ నాయకులు సెలెబ్రెటీలు తాము చెప్పే విషయాలను ఆచరించరు ఇప్పుడు సమంత కూడ తాను చెప్పిన మాటలకు భిన్నంగా ప్రవర్తిస్తూ ఆధారాలతో సహా దొరికి పోవడంతో ఆమె పై ఆమె అభిమానులు కూడ విమర్శలు చేస్తున్నారు. దీనితో సమంత చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

సమంత కొంతకాలం క్రితం తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా శాంసంగ్ ఎం30 ఫోన్ కు ప్రమోట్ చేసింది.  ఆ ఫోన్ సూపర్ అని తన మనసును దోచుకుందని అంటూ దాని ఫీచర్స్ వివరిస్తూ ఒక వీడియోను షేర్ చేసింది. అంతేకాదు ఆ ఫోన్ ను కొనుక్కోమని తన అభిమానులకు సలహాలను కూడ ఇచ్చింది. 

ఇప్పుడు లేటెస్ట్ గా సమంత వన్ ప్లస్ 7 ప్రో ఫోన్ లాంచ్ ఈవెంట్ కు హాజరైంది.  ఈ ఫోన్ గురించి ఎంత గొప్పగా మాట్లాడాలో అంత గొప్పగా మాట్లాడి ఆ కంపెనీ నిర్వాహకుల నుండి భారీ మొత్తాలను పొందింది. అయితే అసలు ట్విస్ట్ ఏమిటంటే ఈ రెండు ఫోన్స్ ను సమంత వాడదట. నిన్న ఎయిర్ పోర్ట్ దగ్గర ఐ ఫోన్ వాడుతూ సమంత కొంతమంది కనిపించింది. 

దీనితో సమంత ఫోటోలను తీసిన వారికి ఒక షాకింగ్ నిజం తెలిసింది. సమంత వాడేది ఐ ఫోన్ 11 ప్రో వెర్షన్ ప్రచారం చేసేది వేరే బ్రాండ్ ఫోన్లకు. దీనితో సమంత చెప్పే మాటలు అన్నీ అబద్ధాలు అంటూ అభిమానులు కూడ జోక్ చేస్తున్నారు. తమ చర్మ సౌందర్యం ఫలానా సబ్బు వలన పెరిగింది అంటూ హీరోయిన్స్ యాడ్స్ ఇచ్చి వేరే సబ్బులను వాడుతున్నట్లుగా ప్రస్తుతం సమంత సెల్ ఫోన్స్ విషయంలో జనాలను కన్ఫ్యూజ్ చేస్తూ భారీ పారితోషికాలను పొందుతోంది. దీనితో సమంత ఫ్రాడ్ అంటూ
జోక్స్ పడుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: