గత కొంతకాలంగా మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలను మించి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇప్పటి వరకు అంతర్లీనంగా రాజశేఖర్ నరేష్ ల మధ్య కొనసాగుతున్న భేదాభిప్రాయాలు క్లైమాక్స్ కు చేరుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఆ మధ్య మూవీ ఆర్టిస్ట్ మా అసోసియేషన్ నిధుల వ్యవహారంలో రాజశేఖర్ అధ్యక్ష స్థానంలో ఉన్న నరేష్ కు షోకాజ్ నోటీసులు ఇప్పించడానికి సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయాన్ని మరింత ముదరకుండా కొందరు పెద్దలు రంగంలోకి దిగి తాత్కాలకంగా వీరిద్దరి మధ్య సద్దుబాటు చేసినట్లు తెలుస్తోంది. అయితే మళ్ళీ ఈ వివాదం రాజుకుందనీ ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

లేటెస్ట్ గా మా సంస్థలో ఏకపక్ష నిర్ణయాలు నియంతృత్వ ధోరణి పెరిగిపోయాయని నిరసిస్తూ మా విషయాల పై చర్చించడానికి రాజశేఖర్ ఈ సంస్థ ఉపాధ్యక్ష హోదాలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అయితే అధ్యక్షుడు అనుమతి లేకుండా ఇలాంటి సమావేశాన్ని ఎలా ఏర్పాటు చేస్తారు అంటూ నరేష్ సన్నిహితులు కామెంట్స్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ సమావేశం చెల్లదని నరేష్ తరఫున లాయర్ రాజశేఖర్ కు తన అభ్యంతరాలు వ్యక్త పరిచినట్లు తెలుస్తోంది. 

దీనితో ఇంకా ఏడాదిన్నర పైగా పదవీకాలం ఉన్న మా సంస్థ కార్యనిర్వాహక వర్గం పరిస్థితి ఏమిటి అంటూ ఇండస్ట్రీలోని చిన్న నటుల దగ్గర నుండి పెద్ద నటుల వరకు ప్రస్తుతం మా సంస్థ రాజకీయాల పైనే చర్చలు జరుపుకుంటున్నట్లు టాక్. రాజశేఖర్ రాజకీయాలలో రాణించాలని ప్రయత్నించి ఫెయిల్ అయిన పరిస్థితులలో కనీసం ఇండస్ట్రీకి అయినా నాయకుడుగా ఎదగాలని చేస్తున్న ప్రయత్నాలు వల్ల నరేష్ రాజశేఖర్ ల మధ్య గ్యాప్ ఏర్పడింది అని అంటున్నారు. ఈ విషయం బయటకు లీక్ కాకుండా ప్రయత్నాలు చేస్తున్నా ఈవార్తలు ఇలా లీక్ అవ్వడం మా సంస్థ సభ్యులకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: