పవన్ అసలు సినిమాలు చేయరు అని కుటుంబ సభ్యులే గట్టిగా చెప్పని తరుణంలో పవన్ మళ్ళీ సినిమాలు చేస్తారని కొందరు భావిస్తున్నారు.

 

కొద్దిరోజులుగా మళ్ళీ పవన్ చిత్ర పరిశ్రమలోకి పునరాగమనం పై చర్చ నడుస్తుంది.ఇటీవల సైరా ప్రొమోషనల్ కార్యక్రమాలలో మరియు అలాగే విజయోత్సవ వేదికలపై పవన్ ని చూడడం ఫాన్స్ మళ్ళీ సినిమాలు వస్తారు అని భావిస్తున్నారు.కానీ పవన్ మూవీ విషయంలో చిరంజీవి, చరణ్ లాంటి వారు ఇచ్చిన సమాధానాలు కూడా ఈ పుకార్లను బలపరిచే విధంగా ఉన్నాయి.

 

ఐతే పవన్ మరో మారు మూవీ చేస్తే మాత్రం రికార్డ్ లు బద్దలు కావడం ఖాయం అని చాలా మంది వాదన.చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ గా వచ్చిన ఖైదీ నంబర్ 150 ఎన్ని రికార్డు లు నెలకొల్పినదో తెలిసిన విషయమే. అలాగే పవన్ మరలా సినిమా చేస్తే ఆ చిత్రం ఇండస్ట్రీ రికార్డు లు తుడిపెట్టడం ఖాయం అంటున్నారు.పవన్ అసలు సినిమాలోకి వస్తారా ?...చూడాలి మరి ఎం జరుగుతుందో. కానీ పవన్ చిత్ర పరిశ్రమలోకి పునరాగమనం పై చర్చ నడుస్తుంది. ఆయన మళ్ళీ సినిమాలలోకి రానున్నారని, ఆమేరకు కొందరు దర్శకులతో చర్చలు జరుగుతున్నాయని పుకార్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: