తెలుగు టెలివిజన్ చరిత్రలో బిగ్గెస్ట్ రియాలిటీ షోగా  బిగ్ బాస్ షో  ప్రారంభమైంది . అయితే గత మూడు సీసన్ల  నుంచి ప్రేక్షకులను అలరిస్తుంది బిగ్ బాస్ . బిగ్ బాస్ మొదటి సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా... బిగ్ బాస్ సెకండ్ సెకండ్ కి నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కాగా ప్రస్తుతం బిగ్ బాస్ మూడో సీజన్ కి టాలీవుడ్ మన్మధుడు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అయితే ప్రస్తుతం బిగ్ బాస్  తెలుగు సీజన్ 3 షో టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. అయితే రేటింగ్ పరంగా ఎలా ఉన్నప్పటికీ ఈ షోలో మాత్రం ఎంటర్టైన్మెంట్ లోపించిందని  ప్రేక్షకులు భావిస్తున్నారు.. అయితే బిగ్ బాస్ సీజన్ వన్ తో పోలిస్తే బిగ్ బాస్  తెలుగు సీజన్ 3 మాత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోవడం లేదని టీవీ ప్రేక్షకులు భావిస్తున్నారు . 

 

 

 

 

 బిగ్ బాస్  సీజన్ వన్ లో కంటెస్టెంట్స్ ఎప్పుడు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచేవారు... ఆ తర్వాత వచ్చిన బిగ్ బాస్  సీజన్ 2 లో  కంటెస్టెంట్స్ కాంట్రవర్సి గొడవలు తప్ప... ఎంటర్టైన్మెంట్ ఎక్కడా కనిపించలేదు... అంతే కాకుండా నాని హోస్టింగ్ కూడా బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 మైనస్ గా మారిందని భావించారు. అయితే తాజాగా స్టార్ మా లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోతుందని వార్తలు వస్తున్నాయి. అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నాగార్జునకు  అయితే పేరు పెట్టాల్సిన పనిలేదని... కానీ కంటెస్టెంట్స్ మాత్రం ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచకుండా... ఎప్పుడు కాంట్రవర్సి గొడవలు  చేస్తుండడంతో ఎంటర్టైన్మెంట్ కొరవడుతున్నదని  ప్రేక్షకులు భావిస్తున్నారు. 

 

 

 

 

 అయితే తాజాగా బిగ్ బాస్  తెలుగు సీజన్ 3 పై ప్రముఖ నటుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ వన్ విన్నర్స్ శివబాలాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ త్రీ ని ప్రారంభమైన మొదట్లో చూశానని ఆ తర్వాత చూడలేదని చెప్పారు శివ  బాలాజీ . తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ 3 గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తనకి ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఇష్టమని కానీ ప్రస్తుతం ప్రసారం అవుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 షోలో ఎంటర్టైన్మెంట్ కరువైందని అన్నారు. అందుకే ఈ బిగ్ బాస్  చూడడానికి తను ఆసక్తిని కనబరచడం లేదని శివ బాలాజీ తెలిపారు... అంతేకాకుండా  షూటింగ్ లో  బిజీగా ఉండటం... వ్యక్తిగత పనుల కారణంగా కూడా బిగ్ బాస్ చూడలేకపోతున్నాను శివ బాలాజీ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: