సినిమా రిలీజ్ దగ్గర పడుతోందంటే ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయడానికి సిద్ధమవుతారు. ఇంతకుముండు ఆడియో ఫంక్షన్ అని చెప్పి సినిమాలోని పాటలన్నీ ఒకే రోజు రిలీజ్ చేశారు. అయితే యూట్యూబ్ బాగా ఫేమస్ అయ్యాక ఒకో పాటని రిలీజ్ చేస్తూ సినిమా మీద అంచనాలని పెంచే పనిలో ఉన్నారు. అయితే ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయినా, ఆడియో ఫంక్షన్ అయినా అవి చేసేది సినిమా ప్రమోషన్ కోసమే. సినిమా జనాల్లోకి తీసుకెళ్ళడానికి  ఈ ఫంక్షన్స్ చేస్తారు.


అయితే ఈ ఆడియో ఫంక్షన్ లో హీరో గురించి తెగ పొగుడుతుంటారు.  ఫంక్షన్ మొత్తం ఇలా పొగడ్తలతోనే ఉంటుంది, ఇది అందరికీ తెలిసిన సత్యమే.అంతే కాదు యాంకర్ల ఓవర్ ఎలివేషన్ కూడా విసుగు తెప్పిస్తుంది. అయితే తెలుగు సినిమా దర్శకుడయిన రవిబాబు ఈ ఆడియో ఫంక్షన్స్ పై తనదైన శైలిలో స్పందించాడు. తన సినిమాలకి సినిమాలకి ఏనాడూ ఇలాంటి ఫంక్షన్ చేయని రవిబాబు ఆడియో ఫంక్షన్ లపై మాట్లాడాడు.  


ఆడియో ఫంక్ష‌న్లు, ప్రి రిలీజ్ ఈవెంట్లు చాలా బోర్. నేను వాటిలో కూర్చోలేను. యాంక‌ర్లు వ‌చ్చి పిచ్చి జోకులు వేస్తారు. పొగుడుతారు. నాకు న‌వ్వు రాదు. చాలా ఇబ్బందిగా ఉంటుంది. పైగా ఆ వేడుక‌ల్లో విప‌రీత‌మైన సౌండ్. మొత్తంగా ఇలాంటి కార్య‌క్ర‌మాలు నాకు చాలా బోరింగ్‌గా అనిపిస్తాయి. అందుకే వెళ్ల‌ను’’ అని ర‌విబాబు చెప్పాడు.


అయితే ఆడియో ఫంక్షన్స్ అంతే చిరాకు పడే రవి బాబు తన సినిమాలకి చాలా విభిన్నంగా మార్కెటింగ్ చేసుకుంటాడు. ఆయన మొదటి సినిమా నుండి గమనిస్తే ఈ విషయం క్లియర్ గా అర్థం అవుతుంది. రవి బాబు ప్రస్తుతం ఆవిరి అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. హారర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో రవిబాబుతో పాటు ఇతర నూతన నటీనటులు నటిస్తున్నారు. దిల్ రాజు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: