అల్లుడు శ్రీను సినిమాతో తన పెద్ద కుమారుడిని గ్రాండ్‌గా టాలీవుడ్‌కు పరిచయం చేసిన బెల్లంకొండ సురేష్‌, ఇప్పుడు తన రెండో కొడుకు గణేష్‌ని కూడా హీరోగా లాంచ్‌ చేస్తున్నాడు. పవన్‌ సాధినేని దర్శకత్వంలో బీటెల్‌ ప్రొడక్షన్స్‌, లక్కీమీడియా బ్యానర్‌లపై నిర్మిస్తున్న ఈ సినిమాకు  హీరోయిన్లు దొరకడం లేదట. అసలే ఇప్పుడు తెలుగు సినిమాలకు హీరోయిన్ల కొరత ఎక్కువగా వుంది. అందులో హీరోలకు తగ్గ హీరోయిన్లు దొరకాలంటే అంత ఈజీ కాదట. ఇలాంటి క్రిటికల్ పరిస్దితుల్లో దర్శక నిర్మాతలు కిందా మీదా అవుతుంటే, బెల్లంకొండ గణేష్‌ పరిచయం అవ్వబోయే ఈ సినిమాకు ఏకంగా నలుగురు హీరోయిన్లు కావాలంట.


ఇకపోతే బ్యూటిఫుల్ లవ్ స్టొరీతో, రవితేజ నా ఆటోగ్రాఫ్ మాదిరి కథతో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. టూకీగా చెప్పాలంటే ఒకబ్బాయి,నలుగురు అమ్మాయిల లవ్ స్టోరీ అన్నమాట. అదీగాక ఓ యువకుడి వివిధ దశల్లో అనుభవించే ప్రేమగాథలన్నమాట. ఇప్పటికే ఎర్లీ దశలో కథ కోసం హీరోయిన్ గా చిన్న అమ్మాయిని ఒకరిని ఎంపిక చేసేసారట. ఆమెనే మజిలీ సినిమాలో నాగచైతన్య కూతురుగా నటించిన బాలీవుడ్ బాలనటి కమ్ టీనేజ్ గర్ల్ అనన్య అగర్వాల్ ను ఫైనల్ చేసేసారని సమాచారం.


మిగతా క్యారెక్టర్ల విషయానికి వస్తే ఇక 18 ఏళ్లు, పాతికేళ్లు, ముఫై ఏళ్లు ఇలా వివిధ దశల్లో మరో ముగ్గురు హీరోయిన్లు అవసరం వుందట. ఈ వయస్సు హీరోయిన్స్ కావాలని వెదుకుతున్నారట. అసలే సినిమా  ఇండ్రస్ట్రీకి  కొత్తగా వచ్చే హీరో సరసన నటించడానికి హీరోయిన్స్ రావడం కష్టం. ఇలాంటి పరిస్ధితుల్లో ఎవరెవరు ఈ పాత్రల్లో నటించడానికి ముందుకు వస్తారో వేచి చూడాలంటున్నారు కొందరు. ఇకపోతే ఇది అసలే బెల్లంకొండ సినిమా కాబట్టి కాస్తో కూస్తో పారితోషికం ఎక్కువ ఆఫర్ చేసయినా ఈ పాత్రల్లో నటించడానికి హీరోయిన్స్‌ను తీసుకువస్తారని సినీవర్గాలు గుసగుసలాడుకుంటున్నాయట. 


మరింత సమాచారం తెలుసుకోండి: