బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సినిమా సాహో. సుజిత్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఆగష్టు 20న రిలీజైంది. తెలుగులో పర్వాలేదు అన్నట్టుగా ఉన్నా బాలీవుడ్ లో మాత్రం ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. అయితే సినిమా పెట్టిన బడ్జెట్ కు ఫైనల్ గా లాభాలే వచ్చాయని టాక్.


ఇదిలాఉంటే సాహో సినిమా ఇప్పుడు అమేజాన్ ప్రైం లోకి వచ్చేసింది. ఎన్ని కోట్ల బడ్జెట్ తో తీసిన సినిమా అయినా ఎన్ని వందల కోట్లు వసూళు చేసినా 50 రోజులు పూర్తయితే మాత్రం డిజిటల్ స్ట్రీమింగ్ లో రావాల్సిందే. అమేజాన్ ప్రైం అగ్రిమెంట్ ప్రకారం సాహో ఆన్ లైన్ లో ప్రత్యక్షమైంది. సినిమా బాగుంది బాగాలేదు అన్న కన్ ఫ్యూజన్ లో చూడటం మానేసిన ప్రేక్షకులు అమేజాన్ మీద పడుతున్నారు.


అమేజాన్ ప్రైమ్ లో సాహో సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. ఈ వీకెండ్ లో అంతా సాహో చూసేందుకు టైం ఫిక్స్ చేసుకున్నారు. సాహో సినిమా అమేజాన్ ప్రైం లో సూపర్ హిట్ అయ్యిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇక్కడ కూడా బాలీవుడ్ ఆడియెన్స్ సాహో చూస్తున్నారని తెలుస్తుంది. సాహో డిజిటల్ స్ట్రీమింగ్ అది రిలీజ్ అయిన అన్ని భాషల్లో అందుబాటులో ఉంది.


సో మొత్తానికి సిల్వర్ స్క్రీన్ పై సోసోగానే అనిపించిన సాహో డిజిటల్ స్ట్రీమింగ్ లో మాత్రం దుమ్ముదులిపేస్తుంది. ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించింది. కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న సుజిత్ తన రెండో సినిమా ఇంత పెద్ద భారీ బడ్జెట్ మూవీ చేస్తాడని ఎవరు ఊహించి ఉండరు. అయితే యూట్యూబ్ లా అమేజాన్ లో వ్యూ కౌంట్ ఉండదు కాబట్టి సాహో ఎంతమంది చూశారన్న లెక్క మాత్రం ఉండదు.



మరింత సమాచారం తెలుసుకోండి: