స్టార్ మా టీవీలో గత మూడేళ్లుగా వస్తున్న సూపర్ హిట్ సీరియల్ 'కార్తీక దీపం'. మళయాళంలోని 'కారుముత్తు' నాటికను తెలుగులో కార్తీక దీపం పేరిట రీమేక్ చేయడం జరిగింది. కార్తీక్., దీప అనే ఇద్దరి మధ్య జరిగే సన్నివేశాలను ఎంతో అద్భుతంగా ఈ ధారావాహికలో చూపించారు. అయితే ఈ సీరియల్ కేవలం టీవీ ప్రేక్షకులను మాత్రమే కాకుండా నెటిజన్లను సైతం ఆకట్టుకుంది. సోషల్ మీడియాలలో ఈ సీరియల్ కున్న ఫాలోయింగ్ మనకు తెలియంది కాదు.

 

తెలుగునాట అత్యంత ఆదరణ పొందుతున్న ఈ సీరియల్ లో దీప కేరక్టర్ అంటే కేవలం మహిళలకు మాత్రమే కాదు యువతకు కూడా బాగా ఇష్టమనే చెప్పవచ్చు. కార్తీక్, దీప దాంపత్య జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ సీరియల్ తెలుగులో దాదాపు మూడేళ్లు ప్రాసరమైనది. దీపగా, వంటలక్కగా ప్రేక్షకుల ఆదరణ పొందిన ప్రేమీ విశ్వనాథ్, ప్రతీ మహిళను కదిలించెంత అద్బుతంగా నటించింది. కానీ ప్రస్తుతం ఈ సీరియల్ ముగిసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సీరియల్ అభిమానులు మాత్రం ఏం జరిగిందా అనే టెన్షన్ లో ఉన్నారు. కానీ కార్తీక దీపం ముగిసింది తెలుగులో కాదు., మళయాలం అని తెలుస్తోంది. మలయాళం లో గత ఏడు సంవత్సరాలుగా అలరించిన కారుముత్తు (కార్తీకదీపం) ముగిసింది.

 

అయితే తెలుగు కార్తీక దీపం సీరియల్ కి, మళయాళ కారుముత్తుకి మధ్య కాస్త కథ మార్పులు ఉన్న కూడా రెండు సీరియల్స్ ప్రధాన కథ మాత్రం ఒక్కటే...మళయాళంలో కార్తీక్ దీప విడిపోవడం, దీప గతం మర్చిపోయి..వేరే వ్యక్తిని ప్రేమించడం, కార్తీక్ క్యాన్సర్ వ్యాధితో కెనడా వెళ్లిపోవడం, చివరకు గతం గుర్తుకొచ్చి దీప., కార్తీక్ ను వెతుక్కుంటూ రావడం, చివరకు కార్తీక్, దీప కలవడంతో సీరియల్ ముగిసింది. అయితే మలయాళ రీమేక్ కావడంతో తెలుగులో ఇప్పటికే 3 సంవత్సరాల పూర్తి అయిన సీరియల్, ఇంకా 4 సంవత్సరాలు మినిమం పట్టే అవకాశం ఉంది. కాబట్టి వంటలక్క అభిమానులు పండగ చేస్కోండి..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: