ఏ డైరెక్టర్‌కైనా మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ రావాలంటే ఎన్నో సినిమాల అనుభవం ఉండాలి. పెద్ద బ్లాక్ బస్టర్స్ తీసి హిట్ కొట్టుండాలి. అయినా ఆ డైరెక్టర్ కి చిరుతో సినిమా చేసే అవకాశం వస్తుందన్న గ్యారెంటీ లేదు. లక్కీ గా సైరా సినిమాతో మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్నాడు సురేందర్ రెడ్డి. అయితే ఆ ఛాన్స్ ఊరికే రాలేదు. మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో దృవ వంటి బ్లాక్ బస్టర్ ని ఇచ్చాడు కాబట్టే సైరా అవకాశం వచ్చింది. అంతేకాదు సినిమాని చాలా స్టైలిష్ గా తీస్తాడనే మంచి పేరుంది కాబట్టి సురేందర్ రెడ్డి కి త్వరగానే చిరుని డైరెక్ట్ చేసే అవకాశం ఈజీగా వచ్చింది. ఇక మెగాస్టార్ నెక్స్ట్ సినిమా 152 కి కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నాడన్న విషయం తెలిసిందే. 

ఇక శివ ట్రాక్ రికార్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజమౌళి లాగా ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడ చూడని ఘనత శివ సొంతం చేసుకున్నాడు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను..ఇలా తీసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతేకాదు ఆయన కథలో సామాజిక అంశం ఖచ్చితంగా ఉండటంతో పాటు సినిమాని చాలా నీట్ గా రిచ్ గా తెరకెక్కిస్తాడన్న పేరును సంపాదించుకున్నాడు. అయితే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ కి కూడా చిరు ని డైరెక్ట్ చేయాలని ఉందట. ఇది అత్యాశే అని చెప్పొచ్చు. కారణం సందీప్ తీసింది కేవలం ఒక సినిమానే. అది కూడా కంప్లీట్ బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమా. ఇదే కథ ని మక్కి కి మక్కీ గా బాలీవుడ్ లో తీసి హిట్ కొట్టాడు. ఈ సినిమా హిట్ తో బాలీవుడ్ లో మరో ఛాన్స్ అందుకున్నాడు. అయితే తనకు మాత్రం మెగాస్టార్ ని డైరెక్ట్ చేయాలని ఉందట. 

అర్జున్ రెడ్డి విడుదలైన వెంటనే సందీప్ మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. మహేష్ బాబుకు స్క్రిప్ట్ కూడా వినిపించాడని ప్రచారం జరిగింది. కాని మహేష్ బాబుతో సందీప్ రెడ్డి సినిమా మాటల వరకే పరిమితం అయింది. అర్జున్ రెడ్డి హిందీ వర్షన్ కబీర్ సింగ్ తో సందీప్ బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు హీరోలను కూడా బాగా ఆకట్టుకున్నాడు. బాలీవుడ్ యంగ్ హీరోలు కొంతమంది సందీప్ వంగతో సినిమా చేయాలని ఆరాటపడుతున్నారు కూడా. ఇక టాలీవుడ్ యంగ్ హీరోలు కూడా సందీప్ ఎప్పుడు కావాలంటే అప్పుడు డేట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సందీప్ కు మాత్రం మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని ఉందట. ఇప్పటికే సందీప్ దగ్గర చిరంజీవి బాడీలాంగ్వేజ్ కు తగ్గ కథ ఉందని.. ఆయనకు ఒక్కసారి కథ చెప్పినా చాలని అంటున్నాడట. చిరంజీవి సినిమా చేసేందుకు ఒప్పుకోకున్నా తన కథ విన్నా చాలంటూ సందీప్ వంగా చాలా గట్టిగా కోరుకుంటున్నాడని లేటెస్ట్ న్యూస్. అయితే ఇది తెలిసిన కొంతమంది ఇది మరీ అత్యాశగా లేదు అంటున్నారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: