చూడడానికి పొట్టిగా ఉన్నా సీమ టపాకాయ్ లా హడావిడి చేస్తూ ఉంటుంది నిత్య. హీరో నితిన్ దృష్టిలో అదృష్ట దేవతగా మారిన నిత్యకు పెద్దగా టాలీవుడ్ లో అవకాశాలు లేక పొయినా ఆమె టాలీవుడ్ టాక్ ఆఫ్ డి ఇండస్ట్రీ గానే ఉంటుంది. టాలీవుడ్ టాప్ హీరో బాలయ్య సైతం నిత్యపై ఫిదా అయిన విషయం తెలిసిందే. అంతేకాదు ఈమెను ఒకనాటి సౌందర్య తో పోలుస్తారు. కొంచెం పొడుగు ఉండి ఉంటే తన పక్కన హీరోయిన్ గా పెట్టుకుని ఉండే వాడిని అని బాలయ్య అన్నాడు అంటే నిత్య రేంజ్ ఏమిటో తెలుస్తుంది.  అటువంటి నిత్య మళ్ళీ వార్తలకేక్కింది. ఏకంగా నిత్య ఇప్పుడు పెద్దల హీరోల పొగరపై దెబ్బ కొట్టింది. ఇప్పటి వరకు ఏ హీరోయిన్ ఇలాంటి సాహసం చేయ్యలేదు. కానీ నిత్యా మీనన్ ఎవరికి భయపడకుండా తన మనసులో మాటను బయట పెట్టింది. గతంలో ఒకసారి తెలుగు హీరో ప్రభాస్ ఎవరూ..? అతను నాకు తెలియదు అని కామెంట్ చేసి సెన్షేషనల్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత దానిపై వివాదాలు రేగినప్పుడు ‘నేను తెలుగు సినిమాలు చూడను అందుకే తెలియదు' అని ధైర్యంగా చెప్పేసింది. అయితే ఈ విషయంలో నిత్యాను మెచ్చుకున్న టాలీవుడ్ హీరోలు కూడా ఉన్నారు.  ప్రస్తుతం నిత్య మరో సంచలనం రేపింది. వయసు ముదిరిన హీరోలపై నిత్య చేసిన హాట్ కామెంట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. నయనతారలా తనకంటే పెద్ద వయసున్న హీరోలతో నటించనని మరో షాక్ ఇచ్చింది నిత్య. అంతేకాదు తనకు సినిమాను ఎంచుకోవడంలో కొన్ని పద్ధతులున్నాయని, ఆ సినిమాలోన తనతో జంటగా నటించే హీరో తనకూ నచ్చాలని, ఏజ్ బార్ హీరోలతో తను సూట్ కానని తేల్చి చెప్పేస్తోంది నిత్య. అయితే నిత్య ఇలా మాట్లడడానికి గల కారణం ఆమెకు అవకాశాలు రావడంలేదని నిరాశతో ఇలాంటి కామెంట్లు చేసిందా లేదంటే ధైర్యంగానే హీరోలను టార్గెట్ చేస్తోందా అంటు అనేకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: