టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్..కథ రాయాలంటే బ్యాంకాక్ వెళ్ళి రావాల్సిందే. అక్కడ పటాయ బీచ్ లో కూర్చొని వారం రోజుల్లో కథ రాసుకొని వస్తారు పూరి. మరో వారం రోజులైతే కంప్లీట్ స్క్రిప్ట్ ఫినిష్ చేసేస్తారు. అయితే ఈ మధ్య ప్లేస్ మార్చి గోవా వెళుతున్నారు. వాస్తవంగా పూరి ముందు గోవా కే వెళ్ళేవారు. డైరెక్టర్ గా బాగా ఫేమస్ అవడంతో లొకేషన్ మారింది. అయితే ఇలా గోవా వెళ్ళేవాళ్ళలో మన సినిమా వాళ్ళు చాలా మందే ఉన్నారు. బర్త్ డే పార్టీలకి, న్యూ ఇయర్ పార్టీలకి బెస్ట్ ప్లేస్ అంటే గోవా నే. అయితే ఇక్కడ మన టాలీవుడ్ హీరో మాత్రం వేరే కారణంతో గోవా వెళుతుంటాడట. సినిమా ఫ్లాప్ అయితే హీరోలు ఒక్కొక్కరు ఒక్కోలా ఆ ఫ్లాప్ నుంచి బయటపడ్డానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రభాస్ అయితే ఫ్లాప్ వస్తే రోజంతా ఎవరు డిస్ట్రబ్ చేయొద్దని చెప్పి నిద్రపోతాడట. రాజ్ తరుణ్ అయితే ఎవ్వరికీ చెప్పకుండా ఎటో వెళ్లిపోతుంటాడు. ఇక మహేష్ రిలీజ్ రోజు అస్సలు మన దేశంలోనే ఉండడు. 

ఇలా ఒక్కో హీరో ఒక్కో రకంగా ఫ్లాప్ మూడ్ నుండి బయటపడటానికి చూస్తుంటారు. ఆది సాయికుమార్ కూడా తనకు ఫ్లాప్ వస్తే గోవా వెళ్లిపోతానంటు ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు. "ఫెయిల్యూర్స్ పట్టించుకోకుండా ఉండలేను..అందుకే నేను గోవా వెళ్లిపోతాను. ఫ్లాప్ అని తెలిసిన వెంటనే గోవా వెళ్లిపోయి, ఓ 2-3 రోజులు పూర్తిగా రిలాక్స్ అయి వస్తాను. ఆ తర్వాత మళ్లీ కొత్త సినిమాతో సెట్స్ మీదకు వెళతాను.  మనం చేసే సినిమాలు కచ్చితంగా హిట్ అవుతాయని చెప్పలేం. వంద సినిమాలొస్తే 5-6 మాత్రమే సక్సస్ అవుతున్నాయి. ఆ 5-6 సినిమాల్లో ఉండడానికే ప్రయత్నిస్తున్నాను..." అంటు తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఇక ఆది నటించిన ఆపరేషన్ గోల్డ్ ఫిష్ తాజాగా థియేటర్లలోకి వచ్చింది. రిలీజైన మొదటిరోజే సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చి నటించిన ఎన్నో ఫ్లాప్ సినిమాల్లో ఇది కూడా ఒకటిగా మిగిలింది. 

సో.. ఈసారి కూడా ఆది సాయికుమార్ గోవా వెళ్లడానికి రెడీ అని ఫిక్సైపోవచ్చు. ఇక అసలు ఈ సినిమాలో నటించడానికి ఎందుకు ఒప్పుకున్నాననే విషయాన్ని బయటపెట్టాడు ఆది. "ఆపరేషన్ గోల్డ్ ఫిష్ లో అర్జున్ పండిట్ అనే క్యారెక్టర్ ను ఒకే లైన్ లో చెప్పి ఉంటే చేసే వాడ్ని కాదేమో. వద్దులే తర్వాత చూద్దాం అని చెప్పి పంపించేసేవాడ్ని. కానీ కథ మొత్తం విన్న తర్వాత నచ్చి వెంటనే చేశాను. ఆ సినిమాలో ఎన్ఎస్జీ కమాండో లుక్ నాకు మాత్రమే కాదు, మా డాడీకి కూడా చాలా బాగా నచ్చింది. అందుకే వెంటనే నటించడానికి ఒప్పుకున్నాను." అన్నాడు. అయితే సినిమా ఆడదన్న విషయం కథ వింటున్నప్పుడు తెలీలేదేమో గాని మొత్తానికి ఆది ని సినిమా బాగా డిసప్పాయింట్ చేసింది. మరి ఈ కుర్ర హీరోకి ఒక యావరేజ్ హిట్ పడాలన్న కష్టంగా ఉంది. ఇలాంటి నేపథ్యంలో పోటీని ఎలా తట్టుకుంటాడో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: