‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో మహేష్ తో రష్మిక నటిస్తున్న నేపధ్యంలో వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుంది అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. దీనికితోడు ఈ మూవీలోని రష్మిక లుక్ ఎలా ఉంటుంది అన్న విషయానికి సంబంధించిన ఫోటోలు కూడ ఇప్పటి వరకు లీక్ అవ్వలేదు. 

ఇలాంటి పరిస్థితులలో ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో రష్మిక లుక్ ఇదే అంటూ గొర్రెలను కాచుకునే గెటప్ లో కర్ర పట్టుకుని నుంచుని ఉన్న రష్మిక ఫోటోను కొంతమంది సోషల్ మీడియాలో పెట్టారు. అలా పెట్టిన ఆ ఫోటో క్షణాలలో వైరల్ కావడమే కాకుండా ‘సరిలేరు నీకెవ్వరు’ లో రష్మిక పాత్ర గొర్రెల కాపరి పాత్ర అంటూ కొందరు జోక్స్ వేయడం మొదలు పెట్టారు. 

దీనితో మహేష్ అభిమానులు కలవర పడుతూ ఈ వార్తలలోని నిజాల గురించి అన్వేషణ చేయడం మొదలు పెట్టారు. జరుగుతున్న ఈ హడావిడిని గ్రహించిన ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ వెంటనే రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చింది. మహేష్ అభిమానులు బాధపడుతున్నట్లుగా రష్మిక పాత్రకు సంబంధించిన ఫోటో కాదని గతంలో రష్మిక కన్నడంలో నటించిన ఒక పాత సినిమాలోని ఫోటో మాత్రమే అంటూ క్లారిటీ వచ్చింది. 

దీనితో మహేష్ అభిమానులు ఆ షాక్ నుండి తేరుకున్నారు. ఇప్పటికే మహేష్ రష్మికల లవ్ కెమిష్ట్రీ జనానికి నచ్చుతుందా అని భయపడుతున్న మహేష్ అభిమానులకు ఇప్పుడు వచ్చిన ఈ క్లారిటీతో కొంత తెరిపిన పడ్డారు. ఈ నెగిటివ్ ప్రచారం అంతా మహేష్ యాంటీ ఫ్యాన్స్ మహేష్ అభిమానులను కార్నర్ చేయడానికి క్రియేట్ చేసిన డ్రామా అని తెలుస్తోంది. టాప్ హీరోలు మాత్రమే కాకుండా వారి అభిమానులు కూడ విడుదల కాబోయే భారీ సినిమాల గురించి ఎలా టెన్షన్ పడతారో ఈ సంఘటన  మరొకసారి రుజువు చేసింది..



మరింత సమాచారం తెలుసుకోండి: